బిజినెస్

బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను పునరుద్ధరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను పునరుద్ధరించి వృత్తిపరమైన సమున్నత సంస్థలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం రాజ్యసభకు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం (వీఆర్‌ఎస్)కు మంచి స్పందన వచ్చిందని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన వెల్లడించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో 79 వేల మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌కు సుముఖత వ్యక్తం చేశారని, అలాగే ఎంటీఎన్‌ఎల్‌లో పనిచేస్తున్న మొత్తం 20 వేల మంది ఉద్యోగుల్లో 14 వేలమంది ఐచ్చికాన్ని దరఖాస్తుల ద్వారా తెలియజేశారని మంత్రి వివరించారు. ప్రస్తుతం ఈ కంపెనీల్లో ఉద్యోగుల నిర్వహణ ఖర్చు మొతాదును మంచి ఉన్నందున దాన్ని తగ్గించుకునేందుకే వీఆర్‌ఎస్ పథకాన్ని అమలులోకి తెచ్చినట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌కు వ్యూహాత్మక ఆస్తులున్నాయని, ప్రధానంగా భూకంపాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల్లో, రక్షణ రంగానికి చెందిన అంశాల్లో ఈ కంపెనీలు ప్రజలకు ఎంతో సహాయకారులుగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కీలక అంశాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ కంపెనీలను పునరుద్ధరించి ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దాలన్న నిర్ణయానికి వచ్చిందని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. గత అక్టోబర్ 23న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ను పునరుద్థరించే ప్రణాళికకు ఆమోదం లభించిందని, ఇందులో భాగంగానే సిబ్బందిని తగ్గించుకునే చర్యలకు శ్రీకారం చుట్టామన్నారు. నవంబర్ 4న వీఆర్‌ఎస్ పథకాన్ని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టిందని, 50 ఏళ్ల పైబడిన అర్హులైన ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని, డిసెంబర్ 3 వరకు సంబంధిత వెబ్‌సైట్ తెరిచివుంటుందని వివరించారు. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ మొత్తం ఆదాయంలో 75.06 శాతం, ఎంటీఎన్‌ఎల్‌లో 87.15 శాతం ఉద్యోగుల నిర్వహణ ఖర్చులకే సరిపోతోందన్నారు. అదే ప్రైవేటు రంగ టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్‌లో ఉద్యోగుల నిర్వహణ ఖర్చులు కేవలం 2.95 శాతం, వొడాఫోన్ ఐడియాలో 5.59 శాతం, జియోలో 4.27 శాతంగా ఉన్నాయని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల విషయానికొస్తే ‘వారు పూర్తిగా సంబంధిత కాంట్రాక్టర్ పరిధిలో కొనసాగుతున్నారని, వారికి పేస్కేళ్లు అమలు చేయాలన్న డిమాండ్‌ను అమలులోకి తేవడం సంబంధిత కాంట్రాక్టర్ నిర్ణయంపైనే అధారపడి ఉంటుందని మరో ప్రశ్నకు సమాధానంగా రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.