బిజినెస్

కేరళ రాష్ట్రానికో బ్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, నవంబర్ 30: కేరళ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్టు సహకార శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. రాష్ట్రంలోని జిల్లా సహకార బ్యాంకులన్నింటినీ విలీనం చేసి, రాష్ట్రానికి ఓ కొత్త బ్యాంకును తీసుకొస్తామని ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను కేరళ హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో, బ్యాంకు ఏర్పాటుకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. ఈ చర్య మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోనే పెను మార్పులకు కారణమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ బ్యాంకుకు ఒక పేరును సూచించాల్సిందిగా సురేంద్రన్ ప్రజలను కోరారు. బ్యాంకు ఏర్పాటుకు హైకోర్టు అనుతమిచ్చిందని, కాబట్టి, ఈ దిశగా చర్యలను వేగవంతం చేస్తామని వివరించారు. రాష్ట్రంలోని 13 జిల్లా సహకార బ్యాంకు (డీసీబీ)లను కేరళ రాష్ట్ర సహకార బ్యాంకులో విలీనం చేస్తామన్నారు. ఇందుకు అవసరమైన తీర్మానాలను ఆయా బ్యాంకుల సమావేశాల్లో ఆమోదిస్తారని, ఆతర్వాత విలీనం ప్రక్రియ మొదలవుతుందని మంత్రి వివరించారు.