బిజినెస్

మార్కెట్ విస్తరణకు హ్యుందయ్ సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: హ్యుందయ్ ఇండి యా తన ఎస్‌యూవీ వెన్యూ మోటల్ వాహన మార్కెట్‌ను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఆఫ్రియా, లాటిన్ అమెరికాలో ఉన్న మార్కెట్‌ను అందిపుచ్చుకోవానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎడమ వైపు స్టీరింగ్ ఉండే (ఎల్‌హెచ్‌డీ) వాహనాలను ఉత్పత్తి చేస్తున్నామని, వాటిని గల్ఫ్‌తోపాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో విక్రయించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని హ్యుందర్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది చివరిలోగా ఈ వాహనం బుకింగ్స్ లక్ష దాటవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. చెన్నై పోర్ట్ నుంచి దక్షిణాఫ్రికాకు డిసెంబర్ మాసంలో 1,400 వాహనాలను పంపుతున్నట్టు సంస్థ తన ప్రకటనలో వివరించింది. ఎస్‌యూవీ బ్రాండ్ వాహనాలను ఇప్పటికే నేపాల్, భూటాన్, మారిషస్, సెచెల్లెస్ తదితర దేశాల్లో అమ్ముడవుతున్నట్టు తెలిపింది. ఇప్పుడు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలపై దృష్టి పెట్టినట్టు పేర్కొంది. దేశంలో ఎస్‌యూవీ వాహనాలకు బుకింగ్ మొదలైనప్పుడు 90,000 మైలురాయిని చేరిందని గుర్తుచేసింది.