బిజినెస్

మార్కెట్లకు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 30: గతం వారంతో పోలిస్తే, ఈవారం పరిస్థితులు స్టాక్ మార్కెట్లకు ఊతాన్నిచ్చాయి. లావాదేవీలు జరిగిన ఐదు రోజుల్లో మూడు రోజులు స్టాక్ మార్కెట్ల లాభాలను ఆర్జించగా, రెండు రోజులు స్వల్ప నష్టాలు ఎదురయ్యాయి. స్థూలంగా చూస్తే మాత్రం, గత వారం కంటే ఈసారి పరిస్థితి చాలా వరకు మెరుగైందనే చెప్పాలి. వాస్తవానికి ఈవారం కూడా లాభనష్టాల దాగుడుమూతలు కొనసాగాయి. అయితే, రికార్డు స్థాయి పతనాలు మాత్రం లేవు. ఈ వారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో లావాదేవీలను పరిశీలిస్తే, ట్రేడింగ్ కొంత వరకూ సానుకూల ధోరణుల్లోనే కొనసాగిందనే విషయం స్పష్టమవుతున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల నుంచి అంతర్జాతీయ సూచీల వరకూ పలు అంశాలు భారత స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేశాయి. కార్పొరేట్ రంగానికి ఊతమిచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, అదే విధంగా ఎగుమతులను పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని గత వారం కేంద్ర చేసిన ప్రకటన మార్కెట్లకు అవసరమైన కొత్త జవసత్వాలను అందించాయి. ఆర్థిక రంగం ఏ విధంగా ఉండబోతుందనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, స్టాక్ మార్కెట్ సానుకూలంగానే కనిపించింది. గత వారం లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం మార్కెట్లు నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. సెనె్సక్స్ 215.76 పాయింట్లు పతనం కావడంతో 40,359.41 పాయింట్లుగా నమోదుకాగా, నిఫ్టీ 54 పాయింట్లు తగ్గడంతో 11,914.40 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం మీద గత వారం స్టాక్ మార్కెట్లు మొదటి రోజు నష్టం, ఆతర్వాత రెండు రోజులు లాభం, తిరిగి చివరి రెండు రోజులు నష్టాల్లో ముగిశాయి. కాగా, ఈవారం ట్రేడింగ్‌కు మొదటి రోజైన సోమవారం స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగానే ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 529.82 పాయింట్లు పెరిగి, 40,889.23 పాయింట్లకు చేరుకోవడంతో, వారం మొత్తం లాభాల బాట తప్పదన్న అభిప్రాయం నెలకొంది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 159.35 పాయింట్లు పెరిగి, 12,073.75 పాయింట్లకు చేరింది. ఇక్కడ కూడా ట్రేడింగ్ అదే రీతిలో కొనసాగవచ్చని విశే్లషకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, మరుసటి రోజే మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. సెనె్సక్స్ 67.93 పాయింట్లు పతనమై 40,821.30 పాయింట్లకు చేరగా, నిప్టీ 36.05 పాయింట్లు తగ్గడంతో 12,037.70 పాయింట్లుగా నమోదైంది. వారంలో రెండు రోజే నష్టాలు తప్పకపోవడంతో, గత వారంలో మాదిరిగానే ఈసారి కూడా మార్కెట్లు గందరగోళానికి గురయ్యాయి. అనిశ్చితి కారణంగా నష్టాలు తప్పకపోవచ్చన్న వాదన కూడా బలంగా వినిపించింది. కానీ, బుధవారం సెనె్సక్స్ 199.31 పాయింట్లు లాభపడి, 41,020.61 పాయింట్లకు చేరగా, నిఫ్టీ 63 పాయింట్లు పెరగడంతో 12,100.70 పాయింట్లకు వెళ్లింది. గురువారం కూడా మార్కెట్లు లాభాల బాటలోనే నడిచాయి. సెనె్సక్స్ 109.56 పాయింట్లు పెరిగి, 41,130.71 పాయింట్లకు, నిఫ్టీ 50.45 పాయింట్లు పెరిగి 12,151.15 పాయింట్లకు చేరాయి. రెండో రోజు నష్టాలను పక్కకుపెడితే, ఈవారం మార్కెట్లు లాభాల్లోనే ముగుస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, చివరి రోజైన శుక్రవారం అనూహ్యంగా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 336.26 పాయింట్లు పతనమైన సెనె్సక్స్ 40,793.81 పాయింట్లకు, 95.10 పాయింట్లు నష్టపోయిన 12,056.05 పాయింట్లకు పడిపోయాయి.
గత వారంతో పోలిస్తే ఈవారం స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా కొనసాగాయి. మూడు రోజులు లాభం, రెండు రోజుల నష్టంలో ఈవారం లావాదేవీలు జరిగాయి. అయితే, వారం మొత్తం మీద సెనె్సక్స్ ఏకంగా 434.40 పాయింట్లు పెరగడం స్టాక్ మార్కెట్‌కు ఊరటనిచ్చే అంశం. వచ్చే వారం కూడా మెరుగైన పరిస్థితుల్లోనే ట్రేడింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్టు మార్కెట్ విశే్లషకులు అంటున్నారు. ఏవైనా అనూహ్య పరిణామాలు ఎదురైతే తప్ప, భారత స్టాక్ మార్కెట్లకు నష్టాలు ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.