బిజినెస్

పెన్షన్ పథకంలో చేరిక సులభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పెన్షన్ పథకంలో చేరడం ఇప్పుడు చాలా సులభమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ అన్నారు. ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్‌ధన్ (పీఎంఎస్‌వైఎం) పథకంలో కోటి మందిని, జాతీయ భవిష్య నిధి పథకం (ఎన్‌పీఎస్)లో 50 లక్షల మంది పేర్ల నమో దు కార్యక్రమంతోపాటు వారోత్సవాలను ఆయన శనివారం ఇక్కడ ప్రారంభించారు. పీఎంఎస్‌వైఎం పథకం కార్మికులకు, ఎన్‌పీఎస్ పథకం వ్యాపారులకు సంబంధించిందని ఆయన వివరించారు. ఆధార్ కార్డు, జన్‌ధన్ కింద తెరచిన సేవింగ్స్ ఖాతా వివరాలు ఉంటే రెండుమూడు నిమిషాల్లో పెన్షన్ పథకంలో పేర్లను నమోదు చేసుకోవచ్చని అన్నారు. నెలవారీ చెల్లింపులు తక్కువలో తక్కువ 55 రూపాయలు, అత్యధికంగా 200 రూపాయలు ఉంటుందని గాంగ్వార్ పేర్కొన్నారు. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి చేరితో నెలకు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సదరు వ్యక్తి సంవత్సరానికి 1,200 రూపాయలు చొప్పున, మొత్తం కాంట్రిబ్యూషన్ కాలానికి 36,000 రూపాయలు చెల్లిస్తాడని అన్నారు. 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు 3,000 లేదా సంవత్సరానికి రూ.36,000 చొప్పున ఆ వ్యక్తికి పెన్షన్ వస్తుందని తెలిపారు. ఒకవేళ పెన్షన్ దారుడు మృతి చెందితే, ఆయన భార్యకు నెలకు 1,500 రూపాయలు చొప్పున అందిస్తారని చెప్పారు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకం కింద నమోదుకు అర్హులైతే, ఇద్దరూ విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం వృద్ధాప్యంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.

*చిత్రం... కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వార్