బిజినెస్

గత నెలలో.. రూ. లక్ష కోట్లు దాటిన జీఎస్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: మూడు నెలల తర్వాత తాజాగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఊపందుకున్నాయి. గడచిన నవంబర్‌లో ఈ వసూళ్లు 6 శాతం పెరిగి లక్ష కోట్ల రూపాయల మార్కును దాటాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 1.03 లక్షల కోట్లు వసూలయ్యాయని, ఇటీవలి పండుగ సీజన్ ఇందుకు ప్రధానంగా దోహదం చేసిందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. గత ఏడాది ఇదే నెలలో రూ. 97.637 కోట్లు వసూలయ్యాయి. అలాగే ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ వసూళ్ల ద్వారా రూ. 95,380 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. దాదాపు రెండు నెలలపాటు వసూళ్లలో వృద్ధి లేకపోవడంతో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టిని సారించి చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో తాజాగా వసూళ్లలో గణనీయ వృద్ధి చోటుచేసుకోవడం ద్వారా దేశంలో వినిమయం, పన్ను వర్తింపు పెరిగాయని తేటతెల్లమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా గడచిన నెల రోజులుగా దేశీయంగా జీఎస్టీ వసూళ్ల ద్వారా లావాదేవీల్లో 12 శాతం వృద్ధి నెలకొంది. ఈ ఏడాది ఇదే అత్యధిక శాతం కావడం విశేషం. స్థూలంగా గత నెలలో రూ. 1,03.492ల వసూళ్లు జరిగాయి. ఇందులో సీజీఎస్టీ రూ. 19,592 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ. 27,144 కోట్లు, ఐజీఎస్‌టీ రూ. 49,028 కోట్లు (దిగుమతుల ద్వారా వసూలైన రూ. 20,948 కోట్లు కలుపుకుని), సెస్ రూ. 7,727 కోట్లు (దిగుమతుల ద్వారా వసూలైన (రూ. 869 కోట్లు సహా) ఉన్నట్టు అధికారులు ఓ ప్రకటనలో వివరించారు. జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 2017 జూలైలోప్రవేశపెట్టిన తర్వాత జరిగిన ఈ పన్ను వసూళ్లలో ఇవి మూడవ అత్యధిక స్ధాయి వసూళ్లుగా నమోదయ్యాయి. అలాగే ఇలా నెలవారీ వసూళ్లు లక్ష కోట్లు దాటడం ఇది ఎనిమిదోసారి.
గడచిన జూలైలో రూ. 1,02,083 కోట్లు వసూలుగా ఆ తర్వాత నవంబర్‌లోనే ఈ ఘనత వీలైంది. ఐతే ఎగుమతులపై వసూలవుతున్న జీఎస్టీ శాతం మాత్రం గత నెలలో (-) 13 శాతం తగ్గడం గమనార్హం. కానీ అక్టోబర్‌తో పోల్చుకుంటే (-) 20 శాతం వృద్ధి నెలకొంది. ఇలావుండగా గడచిన అక్టోబర్ నుంచి నవంబర్ వరకు జీఎస్టీఆర్ 3బీ రిటర్న్స్ కోసం మొత్తం 77.83 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొత్తం 25.150 కోట్ల రూపాలు సీజీఎస్టీ ద్వారా సెటిల్మెంట్ చేసింది. అలాగే రూ. 17.431 ఐజీఎస్టీలోని ఎస్‌జీఎస్టీ కింద సెటిల్మెంట్ చేసినట్టు గణాంకాలు తెలిపాయి.