బిజినెస్

విదేశీ పెట్టుబడులదే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: దేశీయ ప్రధాన మార్కెట్లలో గడచిన నవంబర్ మాసంలో విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐలు) రూ. 22,872 కోట్ల నికర నిధులను మదుపు చేశారు. ఇలా వరుసగా మూడో నెలలోనూ దేశీయ పెట్టుబడుల్లో ఎఫ్‌పీఐలదే పైచేయిగా నిలిచింది. డిపాజిటర్స్ గణాంకాలను బేరీజు వేసుకున్న విశే్లషకుల అభిప్రాయం మేరకు అమెరికా-చైనా వాణిజ్య చర్చలు సానుకూలంగా మారడం, దేశీయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తాజా ఆర్థిక ఉద్దీపన చర్యలు ప్రధానంగా ఎఫ్‌పీఐలు మన దేశం వైపు దృష్టి సారించేలా చేశాయని స్పష్టమైంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను తగ్గించుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ప్రైవేటు పెట్టుబడులు పెద్దయెత్తున వస్తున్నాయని, ప్రత్యేకించి ఇందులో ఎఫ్‌పీఐలు అధిక శాతం మదుపు చేస్తున్నారని అంటున్నారు. కాగా నవంబర్‌లో మొత్తం రూ. 25,230 కోట్లు భారత మార్కెట్లలో మదుపుచేసిన ఎఫ్‌పీఐలు రూ. 2,358.2 కోట్ల పెట్టుబడులను ఎఫ్‌పీఐలు రుణ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవడం జరిగింది. అందువల్ల ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ. 22,871.8 కోట్లుగా మిగిలాయని గణాంకాలు చెబుతున్నాయి. కాగా అక్టోబర్‌లో ఎఫ్‌పీఐలు రూ. 16,037.6 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 6,557.8 కోట్లు వంతున విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు మదుపు చేశారు. ఇలావుండగా గత సెప్టెంబర్ మాసంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్ను సంస్కరణలను ప్రస్తుతం అమలులోకి తేవాల్సివుంది. తద్వారా ఇందుకు సంబంధించిన ప్రభావం పెట్టుబడులను మరింతగా పెంచే అవకాశాలున్నాయని విశే్లషకు ప్రణయ్ భాటియా అభిప్రాయపడ్డారు. పన్ను సంస్కరణల అమలుతో ద్రవ్య లభ్యత గణనీయంగా పెరుగుతుందని, తద్వారా ఆర్థికాభివృద్ధి చోటుచేసుకుంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వినిమయాన్ని పెంచడం వల్ల కంపెనీలు ఉత్పత్తిని మరింతగా పెంచుతాయన్న అంచనాలతోనే ప్రస్తుతం పెట్టుబడులు విరివిగా వస్తున్నాయని మరో విశే్లషకుడు హరీష్ జైన్ అంటున్నారు, ప్రధానంగా రెండో త్రైమాసిక బలహీన వృద్ధిరేటు గణాంకాలు స్వల్పకాలానికి విదేశీ మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చంటున్నారు.