బిజినెస్

42 శాతం పెరిగిన కాల్‌డేటా చార్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: టెలికాం రంగంలో నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా మొబైల్ కాల్ రేట్లను వొడాఫోన్ ఐడియా మంగళవారం (3వ తేదీ) నుంచి పెంచనుంది. ఈమేరకు ప్రీ పెయిడ్ సేవలకు 42 శాతం అదనంగా కాల్ డేటా చార్టీలను పెంచుతున్నట్టు ఆ కంపెనీ ఆదివారం నాడిక్కడ ప్రకటించింది. అలాగే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే ఔట్ గోయింగ్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల వంతున చార్జి చేయడం జరుగుతుందని తెలిపింది. వొడాఫోన్‌తో ఐడియా విలీనం నేపథ్యంలో ఈ కంపెనీ దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవిర్భవించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఈ సంస్థ ఆదివారం ప్రీ పెయిడ్ సేవలకు కొత్త టారిఫ్‌లను ప్రకటించింది.
అలాగే డిసెంబర్ 3 మధ్యరాత్రి నుంచి సరికొత్త ప్లాన్లు వినియోదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇందులో రెండు రోజుల ‘అన్‌లిమిటెడ్’ కేటగిరీ, 28, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో కూడిన పథకాలున్నాయన్నారు. వీటిద్వారా కొత్తగా పెంచే 41.2 శాతం కాల్‌డేటా చార్జీలకు తగిన ప్రయోజనాలుంటాయని ఆ కంపెనీ తెలిపింది. తమ సంస్థకే ఈ ప్రణాళికలు సొంతమని వినియోగదారుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని తెలిపింది. ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని అన్‌లిమిటెడ్ ప్లాన్స్‌ను 3వ తేదీ నుంచి సవరించిన కొత్త ప్లాన్స్ ద్వారా భర్తీ చేస్తామని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ప్రధానంగా ఈ అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ద్వారా వినియోదారులు అత్యంత వేగవంతమైన డేటా యూసేజ్‌తోబాటు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ధరల పెరుగుదలతో కూడిన వార్షిక అన్‌లిమిటెడ్ కేటగిరీ ప్రణాళికకు రూ. 2,399 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ. 1,699 గా ఉంది. అలాగే 84 రోజుల వ్యాలిడిటీతో కూడిన ఆరంభ ప్రణాళిక రోజుకు 1.5 జీబీతో ఉంటుందని దీనిపై 31 శాతం పెంచడం ద్వారా ధర 458 నుంచి 599కి పెంచుతున్నట్టు వివరించారు. అలాగే రోజుకు 1.5 జీబీ డేటాతో కూడిన ప్రస్తుత రూ. 199 ప్లాన్‌ను సైతం 25 శాతం అదనంగా రూ. 249కి పెంచుతున్నట్టు తెలిపారు. కాగా గత నెలలో ఈ కంపెనీ భారతీయ కార్పొరేట్ కంపెనీల్లోకెల్లా అత్యధికంగా రూ. 50,921 కోట్ల నష్టాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.