బిజినెస్

ఆర్బీఐ వడ్డీ రేట్ల నిర్ణయం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ ఆర్ధికాభివృద్ధి గణాంకాలు, వాహన విక్రయాల శాతం, రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) వడ్డీ రేట్ల నిర్ణయం, అంతర్జాతీయంగా మార్కెట్ల స్థితిగతులు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. వీటితోబాటు హాంగ్‌కాంగ్‌లో ఆందోళనలపై అమెరికా-చైనా మధ్య నెలకొన్న రాజకీయ వైరుద్ధ్యాలు సైతం గణనీయంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయని వాణిజ్య విశే్లషకులు చెబుతున్నారు. తయారీ, సేవా రంగాల ఆర్ధికాభివృద్ధి స్థితిగతులను తెలిపే సూచీ ‘పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్’ (పీఎంఐ) గణాంకాల మేరకు తయారీ, సేవా రంగాల వృద్ధిరేటు గణాంకాలు ఈ వారం వెలువడనున్న దృష్ట్యా ఈ అంశం సైతం స్టాక్ మార్కెట్లలో క్రయ విక్రయాలను ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదంటున్నారు.
జూలై నుంచి సెప్టెంబర్ వరకు గడచిన రెండోత్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 4.5 శాతానికి పడిపోయిన విషయాన్ని గుర్తుచేస్తూ ఈ ప్రభావం వచ్చే వాణిజ్య వారం సైతం ప్రతికూలతను కొనసాగించవచ్చని ప్రముఖ విశే్లషకులు అజిత్ మిశ్రా, అమర్ అంబానీ అభిప్రాయపడ్డారు. ఈ అధికారిక గణాంకాలు వాస్తవానికి గత శుక్రవారం మార్కెట్ సమయం ముగిసిన తర్వాత వెలువడిన విషయాన్ని సైతం ఆయన గుర్తు చేశారు.
ఈప్రభావం సోమవారం తక్షణ ప్రతికూలతను చాటే అవకాశాలు లేకపోలేదన్నారు. అయితే మధ్యకాలికానికి ఈ ప్రభావం ఉండకపోవచ్చన్నారు. గడచిన వాణిజ్య వారం మొత్తానికి సెనె్సక్స్ 434.40 పాయింట్లు (1.07 శాతం) లాభపడింది. ఇలావుండగా అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్య క్రమంలో దేశీయ తయారీ రంగం, పరిశ్రమల రంగం ప్రధానంగా వృద్ధిరేటు మందగమనం పాలయ్యాయి. దీంతో వినిమయ శక్తి, ప్రైవేటు పెట్టుబడులు సైతం క్షీణించాయి. ఈ అన్ని అంశాలనూ బేరీజు వేసుకుని చూస్తే రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తదుపరి ద్రవ్య వినిమయ సమీక్షా సమావేశంలో (ఈనెల 5న జరుగనుంది) సైతం 25 బేసిస్ పాయింట్ల మేర రెపోరేట్ల కోత విధించే అవకాశాలున్నాయని మరో ప్రముఖ విశే్లషకుడు రాహుల్ గుప్తా తెలిపారు.