బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 3: అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మళ్లీ నష్టాల్లోకి జారాయి. ఇప్పటికే చైనా, భారత్ వంటి దేశాలతో దిగుమతి సుంకాల వివాదాల్లో ఉన్న అమెరికా తాజాగా బ్రెజిల్, అర్జెంటీనా దేశాల నుంచి జరుగుతున్న దిగుమతులపై సైతం సుంకాలను పెంచాలని నిర్ణయించింది. దీంతో మరో వాణిజ్య వివాదం తలెత్తడంతోప్రధానంగా ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈక్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 126.72 పాయింట్లు (0.31 శాతం) నష్టపోయి 40,675.45 పాయింట్ల దిగువ స్థాయిలో స్థిరపడింది. రోజంతా ఈ సూచీ ఊగిలాటకు గురైంది. ఓ దశలో 40,885.03 పాయింట్ల గరిష్టానికి, ఆ తర్వాత 40,554.04 పాయింట్ల కనిష్టానికి చేరింది. అలాగే నిఫ్టీ సైతం 54 పాయింట్లు (0.45 శాతం) కోల్పోయి 11,994,20 పాయింట్ల వద్ద స్థిరపడింది. తాజా అంతర్జాతీయ వాణిజ్య లుకలుకలతో దేశీయంగా లోహ స్టాక్స్ తీవ్ర అమ్మకాల వత్తిడికి గురయ్యాయి. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ సైతం భారీగా వాటాల అమ్మకాల వత్తిడికి గురయ్యాయి. పైగా ఈనెల 5న జరుగనున్న రిజర్వు బ్యాంకు ద్రవ్య వినిమయ విధాన సమీక్ష సమావేశంలో ఏ నిర్ణయం వస్తుందో చూద్దామని మదుపర్లు వేచిచూసే దోరణిని అవలంభించారు. ఇలావుండగా సెనె్సక్స్ ప్యాక్‌లో యెస్‌బ్యాంక్ తీవ్రంగా స్థాయిలో 7.81 శాతం నష్టపోయింది. అలాగే టాటాస్టీల్, వేదాంత, ఎం అండ్ ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటామోటార్స్ సైతం 5.07 శాతం నష్టాల పాలయ్యాయి. మరోవైపు బజాజ్ ఆటో, టీసీఎస్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే లోహ సూచీ 2.67 శాతం నష్టపోగా, వౌలిక పరికరాల సూచీ 1,94 శాతం, టెలికాం 1.76 శాతం, పరిశ్రమలు 1.53 శాతం, వినిమయ రంగం 1.24 శాతం, కేపిటల్ గూడ్స్ 1.18 శాతం, చమురు, సహజవాయువులు 0.86 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.68 శాతం నష్టాలపాలయ్యాయి. మరోవైపుస్థిరాస్తి రంగ సూచీ 1.36 శాతం లాభాలతో చార్టులో అగ్రభాగాన నిలించింది. అలాగే ఐటీ రంగం 0.59 శాతం, వినిమయ వస్తువులు 0.09 శాతం, టెక్ 0.16 శాతం వంతున లాభాలను సంతరించుకున్నాయి. మొత్తం వివిధ రంగాలకు చెందిన 19 సూచీల్లో 15 నష్టపోగా, నాలుగు మాత్రమే లాభపడ్డాయి. అలాగే బ్రాడర్ మార్కెట్లలో లార్జ్‌క్యాప్, స్మాల్ క్యాప్, మిడిల్ క్యాప్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. మిడ్‌క్యాప్ సూచీ 0.95 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.51 శాతం నష్టాలపాలయ్యాయి.
ముదిరిన అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు
అర్జెంటీనా, బ్రెజిల్ దిగుమతులపై సుంకాలను పెంచడంతోబాటు హాంగ్‌కాంగ్‌లో ఆందోళనకారులకు అమెరికా మద్దతిస్తుండడంతో చైనాలోని అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్న రాయితీలను తొలగిస్తామని చైనా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే తీవ్రవాదాన్ని, నేరప్రవృత్తిని ప్రోత్సహిస్తున్న ఆ సంస్ధలపై కేసులు పెడతామని స్పష్టం చేసింది. ఐతే అమెరికాకు చెందిన సైనిక నావలు, యుద్ధవిమానాలను హాంకాంగ్‌లో పర్యటించేందుకు ఇప్పుడు అంగీకరిస్తామని చైనా స్పష్టం చేసిం ది. ఈ పరిణామాలు ప్రస్తుతం సానుకూలంగా సాగుతున్న అమెరికా-చైనా వాణిజ్య చర్చలకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్న అంచనాలతో మదుపర్లు జాగరూకతతో వ్యవహరిస్తున్నారు.
కాగా, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం స్తబ్ధుగా మిగిలింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 1,731.33 కోట్ల విలువైన వాటాలను సోమవారం విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు 753.99 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారు. ఇక ముడిచమురు ధరలు 0.54 శాతం పెరిగి బ్యారెల్ 61.25 డాలర్లు వంతున ట్రేడైంది. ఆసియాలో హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ స్టాక్ మార్కెట్లు నష్టపోగా, షాంఘై మాత్రం స్వల్ప లాభాలతో ముగిసింది. ఐరోపాలో ఆరంభ ట్రేడింగ్‌లో లండన్ 0.1 శాతం నష్టపోగా, ప్రాంక్‌ఫర్ట్ 0.7 శాతం, పారిస్ 0.2 శాతం లాభపడ్డాయి.