బిజినెస్

ధరలు తగ్గే వరకూ సబ్సిడీపై ఉల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 3: ఉల్లి కొరత తీరే వరకు రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించడం ద్వారా అధిక ధరలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉల్లి ధరలపై సీఎం కార్యాలయం (సీఎంఓ) ఎప్పటికప్పుడు వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలు, రైతుబజార్ ఎస్టేట్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తోంది. గత వారం రోజులుగా కిలో రూ. 100 దాటిపోవటంతో అధిక ధరలను అదుపు చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ. 90కు విక్రయించటంపై సీఎం తీవ్రంగా స్పందించారు. బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నా ప్రభుత్వం వెనక్కు తగ్గకుండా ఒక్కరోజే 548 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. రైతుబజార్ల ద్వారా కిలో రూ. 25కే సబ్సిడీపై అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిని అందుబాటులో ఉంచుకోవాలని ఎంత ఖర్చయినా ప్రభుత్వం వెనకాడబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అక్రమ నిల్వలు చేసే వారిపై విజిలెన్స్ నిఘా వహించాలని ఆదేశించారు. మార్కెటింగ్, పౌరసరఫరాలు సంయుక్తంగా దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం రోజుకు 500 నుంచి 12 వందల క్వింటాళ్ల మేర సేకరణ జరుపుతోంది. కిలోకు రూ. 50 చొప్పున సబ్సిడీపై అందిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ధరలు అదుపులోకి వచ్చే వరకు ఇదే రకంగా అమ్మకాలు జరపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. ఇప్పటి వరకు గత 18 రోజుల్లో రూ. 9.50 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనివల్ల రూ. 5.83 కోట్ల భారం పడింది. ఎంత భారంగా ఉన్నా వినియోగదారులకు మాత్రం రూ. 25కే విక్రయాలు జరపాలని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఉల్లి కొరత దేశవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గతంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు 6730.95 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే రూ. 35 లక్షలు మాత్రమే భారం పడింది. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమల్లోకి తెచ్చింది. ఆకాశాన్నంటుతున్న ధరలతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు పడకుండా ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.