బిజినెస్

రామ్‌కో సిస్టమ్స్‌కు భారీ విదేశీ ఆర్డర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 4: మధ్య,తూర్పు దేశాల్లో ఉన్న రామ్‌కో సిస్టమ్స్ అనుబంధ సంస్థ ఐదేళ్ల కాలానికి అమలయ్యే భారీ ఆర్డర్‌ను హస్తగతం చేసుకుంది. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న ఓ ప్రముఖ స్వతంత్ర కుటుంబానికి చెందిన బహుళజాతి సంస్థ నుంచి ఈ ఆర్డను దక్కించుకున్నట్టు రామ్‌కో సిస్టమ్స్ బుధవారం నాడిక్కడ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఆ అంతర్జాతీయ కంపెనీకి చెందిన లాజిస్టిక్స్ సొల్యూషన్స్ కార్యకలాపాలు అమలు చేసేందుకుగాను ఈ ఆర్డర్ దక్కిందన్న రామ్‌కో సిస్టమ్స్ ఎంత మొత్తానికి ఈ ఆర్డర్ దక్కిందన్న విషయం వెల్లడించలేదు. దుబాయ్‌కి చెందిన రామ్‌కో సిస్టమ్స్ ఎఫ్-ఎల్‌ఎల్‌సీ ఈమేరకు రామ్‌కో లాజిస్టిక్స్ ఈఆర్‌పీని నిర్వహిస్తుంది. ఈ సంస్థ తూర్పు, మధ్య దేశాలతోబాటు, ఉత్తర ఆప్రికా, ఐరోపా, ఆసియా దేశాల్లో నాలుగువేల మంది సిబ్బందితో నడుస్తోంది. కాగా ఈ సంస్థ రామ్‌కో లాజిస్టిక్స్ సాఫ్ట్‌వేర్‌లో భాగమైన వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టంను అమలు చేస్తుందని, ఆ లాజిస్టిక్ డివిజన్ ప్రస్తుతం సరుకు రవాణా, ఎం టు ఎం మల్టీమోడల్ సరఫరా చైన్ సొల్యూషన్స్‌ను నిర్వహిస్తోందని కంపెనీ వివరించింది.