బిజినెస్

‘షాక్’ మార్కెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 12: గత మూడు నెలల్లో ఎన్నడూ లేని విధంగా సెనె్సక్స్ సోమవారం తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులకు గురైంది. లావాదేవీలు ముగిసే సమయానికి 444 పాయింట్లు కోల్పోయి 28,353.54కు చేరుకుంది. అలాగే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా 8,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనే స్టాక్ మార్కెట్లలో ఈ ఒడిదుడుకులకు దారితీసింది. అలాగే సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి సంబంధించిన వివరాలు కూడా మార్కెట్‌పై ప్రభావాన్ని చూపించాయి. దాదాపుగా నేటి లావాదేవీల్లో ఐటి, టెక్ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఈ రెండు సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో షేర్ల అమ్మకాలు భారీగా జరిగాయి. ప్రధానంగా టాటా స్టీల్ అత్యధిక స్థాయిలో నష్టపోయింది. ఒకపక్క నష్టాలను చవిచూస్తున్న నేపథ్యంలో టాటా స్టీల్ షేర్ రేటు పడిపోవడం ఆందోళనకు కారణమైంది. అమెరికా వడ్డీ రేట్లను పెంచితే వర్తమాన మార్కెట్లలోకి పెట్టుబడులు తగ్గుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే బ్యాంకింగ్ రంగం కూడా దెబ్బతింటుందని ఈక్విటీ రంగ నిపుణులు చెబుతున్నారు. మరోపక్క అమెరికా మారకద్రవ్యమైన డాలర్‌తో పోలిస్తే రూపాయి మరో 28 పైసలు 66.96కు చేరుకుంది. నేటి లావాదేవీల్లో దాదాపుగా 26 కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. వీటిలో ‘అదానీ’, ఎల్‌అండ్‌టి, ఎన్‌టిపిసి, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఐటిసి, గెయిల్ తదితర కంపెనీల షేర్లు ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయంపై చెలరేగిన ఆందోళనలు హాంకాంగ్, సింగపూర్, షాంఘై మార్కెట్లతో పాటు ఐరోపా మార్కెట్లపై కూడా ప్రభావాన్ని చూపాయి.