బిజినెస్

వౌలిక రంగంలో విదేశీ పెట్టుబడుల సమీకరణపై కేంద్రం ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: సున్నిత, కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడుల తీరుపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. ప్రధానంగా టెలికాం, భౌతిక వౌలిక సదుపాయాల రంగాల్లో దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో వ్యయం చేసేందుకు సంబంధించిన నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల విషయంపై సైతం ప్రభుత్వం క్షుణ్ణంగా సమీక్షించిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశంలోని మెజారిటీ శాతం పరిశ్రమలు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను పొందుతున్నాయని, ఈ విషయంలో అనుమించిన పెట్టులు పొందడం తక్కువగానే జరుగుతోందన్న విషయం ప్రభుత్వ సమీక్షలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అందువల్ల ఈ విషయంలో ప్రత్యేకించి ఈశాన్య ప్రాంతాల్లో వచ్చిన, రాబోయే పెట్టుబడులపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని, దీన్ని వ్యూహాత్మక ప్రాథాన్యతగా తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. అలాగే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)ను మూసివేయకూడదన్న నిర్ణయానికి సైతం కేంద్ర ప్రభుత్వం వచ్చిందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థకు దేశ సరిహద్దు ప్రాంతాల్లో విశేషమైన నెట్‌వర్క్ ఉంది. అలాగే దేశంలోని పలు కీలక రంగాలు ఈ వ్యవస్థతో ముడిపడి ఉన్నాయి. ఇందులో రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం ఉంది. ఈ క్రమంలో ఈ రంగాలు బలపడాలంటే ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు ఆటోమేటిక్‌గా పరిశ్రమల్లోకి వచ్చే విషయంలో స్కూృటినీ ఉండాలని ఆర్బీఐ సైతం ఈ సమీక్షల సందర్భంగా అభిప్రాయపడిందని తెలిసింది. కంపెనీలు నిర్ణీత కాలంలోగా ఈ నిధుల రాబడిపై సెబీ వంటి నియంత్రణ సంస్థలకు వివరించాలని ఆర్బీఐ సూచించినట్టు సమాచారం. చాలా కంపెనీలు విదేశీ పెట్టుబడిదారులను వ్యూహాత్మక వౌలిక సదుపాయాల రంగంలోని ప్రాజెక్టుల్లోకి రాకుండా చేస్తున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయని తెలుస్తోంది.
ప్రత్యేకించి చైనా తన నిధుల సమీకరణను ప్రపంచానికి తెలియజేయడం లేదని, ఆ దేశంతోబాటు జపాన్, దక్షిణ కొరియా సైతం మనదేశ కంపెనీలను ఎక్కువగా అక్కడి టెండర్లలో పాలుపంచుకునే అవకాశం ఇవ్వడం లేదని ఇటీవల కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇలా వివక్ష చూపే దేశాలకు మనదేశంలో పెట్టుబడులకు అవకాశం కల్పించడంలో ఖచ్చితమైన నియంత్రణ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.