బిజినెస్

పార్లమెంట్ ఆమోదం లభించిన వెంటనే.. తుదిరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: వ్యక్తిగత డేటా పరిరక్షణ విధాన బిల్లును పార్లమెంట్ ఆమోదించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్ విధానానికి తుదిరూపం ఇస్తుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సుధాంశు పాండే వెల్లడించారు. వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు మార్గదర్శకాలను అనుసరించే ఈ-కామర్స్ విధానాన్ని రూపొందిచాల్సివుందని ఆ అధికారి స్పష్టం చేశారు. ఈ-కామర్స్ విధాన డ్రాఫ్టు మేరకు దీనిపై న్యాయ, సాంకేతికపరమైన మార్గనిర్దేశం, ఆంక్షలను ప్రత్యేకించి దేశ సరిహద్దు ప్రాంతాల్లో అమలు చేసేందుకు వీలుగా ప్రదిపాదించాల్సివుందన్నారు. ప్రధానంగా వాణిజ్యానికి సంబంధించి సున్నితమైన వ్యక్తిగత డేటాను స్థానికంగా, అంతర్జాతీయంగా నిక్షిప్తం చేయడంపై మార్గదర్శకాలు నిర్థిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని పాండే తెలిపారు. ఈ వ్యకిగత డేటా పరిరక్షణ బిల్లు ప్రతిపాదనలను ఇటీవల దేశ అత్యున్నత చట్టసభలకు చెందిన సంయుక్త సెలెక్ట్ కమిటీకి అప్పగించడం జరిగింది. సంబంధిత వ్యక్తికి తెలియకుండా ఎలాంటి డేటా వినియోగం, స్టోరేజీ చేయరాదని ఆ కమిటీ సూచించింది. ఈకామర్స్ కంపెనీలను అనవసరంగా ఈ చట్టం పరిథిలోకి చేరుస్తున్నారంటూ జరుగుతున్న నిరసనలను ఈ సందర్భంగా పీటీఐ ఆయన దృష్టికి తేగా ఫిర్యాదులు వచ్చినపుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు వాటిపై నిగ్గుదేలుస్తాయని, ఆపై చర్యల బాధ్యత కూడా ఆ ఏజెన్సీలే తీసుకుంటాయని పాండే చెప్పారు. అంతకుముందు ఆయన ‘ఈకామర్స్ ఫర్ సౌత్ ఏషియన్ ఇంటిగ్రేషన్’ పేరిట రూపొందిన ప్రపంచ బ్యాంకు నివేదికను విడుదల చేశారు.