బిజినెస్

దెబ్బతీసిన స్థూల ఆర్థికాభివృద్ధి గణాంకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 16: బలహీన స్థూల ఆర్థికాభివృద్ధి గణాంకాల కారణంగా సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఓ మోస్తరు నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా ఇందన, ఎఫ్‌ఎంసీజీ, వాహన స్టాక్స్ భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఉదయం నుంచి సానుకూలంగా ఆరంభమై తాజా జీవనకాల గరిష్ట స్థాయి 41,185.03 పాయింట్లను తాకింది. ఐతే తర్వాత ఎఫ్‌ఎంసీజీ, వాహన, ఇంధన స్టాక్స్‌తోబాటు కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ సైతం తీవ్ర నష్టాలపాలవడంతో చివరికి 70.99 పాయింట్ల (0.17 శాతం) కోల్పోయి 40.938.72 పాయింట్ల దిగువన స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 32.75 పాయింట్లు (0.27 శాతం) కోల్పోయి 12,053.95 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఈ సూచీలోని 50 షేర్లలో 37 నష్టాలపాలయ్యాయి. సెనె్సక్స్ ప్యాక్‌లో ఐటీసీ అత్యధికంగా 1.97 శాతం నష్టపోగా, టాటాస్టీల్ 1.80 శాతం, హెచ్‌యూఎల్ 1.57 శాతం, వేదాంత 1.44 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.37 శాతం, ఎం అండ్ ఎం 1.35 శాతం నష్టపోయాయి. మరోవైపు టీసీఎస్ లాభాల ర్యాలీ తీసి అత్యధికంగా 2.70 శాతం లాభపడింది. టెక్ మహీంద్రా 1.60 శాతం, హెచ్‌సీఎల్ 1.57 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.83 శాతం, కోటక్ బ్యాంక్ 0.73 శాతం లాభాలను సంతరించుకున్నాయి. కాగా అమెరికా-చైనా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల ప్రభావం వల్ల ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే సాగాయని, ఆ తర్వాత విడుదలైన బలహీన ఆర్థికాభివృద్ధి గణాంకాలు సూచీలను నష్టాల్లోకి దిగజార్చాయని వాణిజ్య వర్గాలు వెల్లడించాయి. అలాగే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌లో 0.58 శాతానికి వృద్ధిచెందడం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిందంటున్నారు. ఈ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 0.16 శాతంగా ఉంది. ప్రధానంగా ఆహార వస్తువులు ధరల పెరుగుదలే ఇందుకు దారితీసిందని విశే్లషకులు చెబుతున్నారు.
మిశ్రమ ఫలితాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లు సైతం సోమవారం మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, సియోల్, టోక్యో స్టాక్ మార్కెట్ సూచీలు మిశ్రమ ఫలితాలను నమోదు చేయగా, ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలనే నమోదు చేశాయి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తాజాగా 18 పైసలు క్షీణించింది. ఇంట్రాడేలో 71.01గా ట్రేడైంది. ఇక ముడిచమురు ధరలు బ్యారెల్ 65.23 డాలర్ల వంతున ట్రేడయ్యాయి.