బిజినెస్

ఎప్పుడేం చేయాలో ఆర్బీఐకి బాగా తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 16: గత ఫిబ్రవరి నెల నుంచి దేశ ఆర్థికాభివృద్థి మందగమనాన్ని రిజర్వుబ్యాంకు గుర్తించిందని, అందుకు అనుగుణంగానే రెపోరేట్లలో కోత విధించి తమవంతు సహాకారాన్ని ప్రభుత్వానికి అందజేశామని ఆ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈదఫాద్రవ్యవినిమయ విధాన సమీక్షా సమావేశంలో రెపోరేట్ల కోతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోని వైనంపై పరిశ్రమలు విస్మయం చేస్తున్నాయన్న విషయంపై స్పందించిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. టైమ్స్ నెట్‌వర్క్ ఆధ్యర్యంలో సోమవారం నాడిక్కడ ఏర్పాటైన భారత ఆర్థిక సదస్సు (ఇండియా ఎకనామిక్ కాంక్లేవ్)లో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశ ఆర్థికాభివృద్ధి విషయంలో ‘పూర్తి సమాచారంతో కూడిన లక్ష్య సాధనకు’ అనుకూలంగా నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉందని, ఆర్థిక మందగమనాన్ని అడ్డుకునే విషయంలో ఆర్బీఐ తనవంతు ఏమి చేయాలో అవసరమైనప్పుడు చేస్తుందని దాస్ వాఖ్యానించారు. అలాగే ద్రవ్యోల్బణాన్ని సైతం అదుపు చేయాల్సివుందని, బ్యాంకులు ఆర్థికంగా ఆరోగ్యదాయకంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత కూడా ఆర్బీఐపై ఉందన్నారు. 2008లోప్రపంచ ఆర్థిక స్థితి లోపించినపుడు అగ్ర రాజ్యాలు సమన్వయంగా వ్యవహరించిన విధంగానే తాజాగా అమెరికా-చైనా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం, అదనపు సుంకాలను తొలగించుకోవడం వంటి చర్యలతో ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని సరిదిద్దడంలో దేశాల మధ్య సమన్వయం నెలకొంటుందన్న ఆశాభావాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. గత ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ ఐదుసార్లు మొత్తం 1.35 శాతం రెపోరేట్ల కోత విధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విషయంలో అటు ప్రభుత్వం ఇటు ఆర్బీఐ సకాలంలో స్పందించి తననుగుణంగా నడుచుకున్నాయన్నారు. అప్పట్లో ఆర్బీఐ తొలిసారి రేట్ల కోతకు ఉపక్రమించిన సందర్భంగా ఆశ్చర్యం ప్రకటించినవారే గత 5వ తేదీన కోతలు నిలిపివేసినపుడు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. రిజర్వుబ్యాంకు మధ్యకాలిక ద్రవ్యోల్బణ లక్ష్యం 4 శాతానికి మించి 5.54 శాతానికి ద్రవ్యోల్బణం పెరగడం ప్రస్తుతం కీలకాంశంగా మారిందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అసలు ఇప్పటి వరకు జరిగిన రేట్లకోత ప్రభావాన్ని సైతం అధ్యయనం చేయాల్సివుందని ఆయన పునరుద్ఘాటించారు.
*చిత్రం... రిజర్వుబ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్