బిజినెస్

మద్యం రేట్లకు కిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆదాయ వనరులను పెంచుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే వివిధ శాఖల్లో ఖర్చులు తగ్గించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆర్టీసీ బస్ టికెట్‌ల రేట్లను పెంచిన ప్రభుత్వం తాజాగా మద్యం రేట్లను పది శాతం పెంచుతూ నిర్ణ యం తీసుకుంది. పాత మద్యం నిల్వలకు కొత్త ధర లు వర్తించవని రాష్ట్ర ఎక్సైజ్
శాఖ పేర్కొంది. సాధారణ మద్యం క్వార్టర్ బాటిల్‌పై రూ.20, హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80 పెరగనున్నాయి. అదేవిధంగా బీరు ధరలు రూ.10 నుంచి 20 రూపాయల వరకు పెంచినట్టు ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటించారు. కాగా, మద్యం ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రూ.400 కోట్ల అదనపు ఆదాయం లభించనుంది. పెరిగిన ధరలకు సంబంధించిన పట్టికను అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం విడుదల చేశారు. పెరిగిన ధరలు ఈనెల 18 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. లైట్ బీరుపై ప్రస్తుతం రూ.100 వసూలు చేస్తుండగా, ఇకపై రూ.110 వసూలు చేయనున్నారు. అదేవిధంగా స్ట్రాంగ్ బీర్లపై రూ.12 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ఇక మద్యం ఫుల్ బాటిల్ ధర ఆయా రకాల బ్రాండ్‌లను బట్టి రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగాయి.