బిజినెస్

జనవరిలో వీఆర్‌ఎస్ అమలైతే బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ. 1,300 కోట్లు ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: వచ్చే 2020 జనవరి 31తో ముగిసే బీఎస్‌ఎన్‌ఎల్‌లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం అమలైతే సంస్థకు రూ. 1,300 కో ట్లు ఆదా అవుతుందని ఆ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ మంగళవారం నాడిక్కడ విలేఖరులకు తెలిపారు. సంస్థలో పనిచేసే 78,569 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ వీఆర్‌ఎస్‌కు అనుమతి లభిస్తుందని స్పష్టం చేశారు. ఎంటీఎన్‌ఎల్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం చేసే విషయం పై కసరత్తు సాగుతోందని, దీనిపై ఇటీవల ఇరు సం స్థల బోర్డులు భేటీ అయ్యాయని ఓ ప్రశ్నకు సమాధానంగా పుర్వార్ చెప్పారు. సవరించిన స్థూల ఆదాయంపై సుప్రీం ఇచ్చిన తీర్పు క్రమంలో సంస్థకు చట్టబద్ధమైన బకాయిలు ఏర్పడ్డాయన్నారు. ఇందు కు సంబంధించిన ఒత్తిడిని తొలగించేందుకు సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు.