బిజినెస్

కార్మిక, కంపెనీ, పన్ను, ఎగుమతి చట్టాలను సరళతరం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: నియంత్రణ విభాగాల తీరుతెన్నులతో ప్రైవేటు పెట్టుబడులకు ఇబ్బందులేవైనా ఎదురవుతున్నాయా? అన్న అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం అధ్యయనం చేశారు. తాజా బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పన నిమత్తం ఆమె వివిధ వర్గాలతో సంప్రదింపులను చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే ఎగుమతుల వృద్ధికి కొత్తగా ఏ చర్యలు చేపట్టడం సబబుగా ఉంటుందన్న విషయంపై ఆమె పరిశ్రమలు, వాణి జ్యం, సేవా రంగాల ప్రముఖులతో చర్చలు సాగించారు. ప్రత్యేకించి పన్నులకు సం బంధించి ఫిర్యాదులు పేరుకునేలా చేయడం సబబు కాదని ఈ సందర్భంగా నిర్మలకు ఆ వర్గాలు సూచించినట్టు తెలిసింది. పన్ను లిటిగేషన్లు తలెత్తకుండా చూడాలని, చిన్న తరహా రిస్క్ ఉన్న పరిశ్రమలకు స్వయం సర్ట్ఫికేషన్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అలాగే పన్ను, కంపెనీ చట్టాల మధ్య వివక్షను తొలగించాలని, వౌలిక వాటా ధరలను తగ్గించి, సరళతరం చేయాలని, సుంకాలు, కార్మిక చట్టాలను సుభతరం చేయాలని, ప్రత్యామ్నాయ సమస్య పరిష్కార ప్రక్రియను అం తర్జాతీయ ప్రమాణాలతో అమలు చేయాలని పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు సూచించాయి. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ)ల ద్వారా జరిగే ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేకంగా ఎగుమతు నిధిని ఏర్పాటు చేయాలని, అలాచేస్తే తయారీ రంగంలోకి పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రికి ఆ వర్గాలు సూచించాయి. కాగా ఈ సందర్భంగా లాజిస్టిక్స్, మీడియా, పర్యావరణ సేవలు, ఐటీ, దాని అనుబంధ సేవలు తదితర అంశాలపై కూలంకషంగా చర్చ జరిగిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.