బిజినెస్

ఖద్దరు రుమాళ్ల తయారీ ద్వారా ఉగ్రవాద బాధిత కుటుంబాలకు ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాశ్మీర్‌లో ఉగ్రవాద మిలిటెంట్ల దాడుల్లో బాధితులైన కుటుంబాలవా రు తయారు చేసిన రుమాళ్లతో ‘ఖాదీ రుమాల్’ పేరిట ఏర్పాటైన ప్రదర్శన, విక్రయాలను కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం నా డిక్కడ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలను కేంద్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) చైర్మన్ వినయ్‌కుమార్ సక్సేనా విలేఖరులకు వివరించారు. 2016లో కేవీఐసీ ఆధ్వర్యంలో కాశ్మీర్ లోయలోని ఉగ్రవాద మిలిటెంట్ల కారణంగా బాధితులైన కుటుంబాల వారికోసం నగ్రోటాలో ప్రత్యేకంగా నాప్కిన్‌ల (చేతి రుమాళ్లు) కుట్టు మిషన్ల కేంద్రం ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. ఈక్రమంలో గత నెల నుంచి ఆ కేం ద్రంలో ఖద్దరు రుమాళ్ల తయారీని ప్రవేశపెట్టారు. ఈ కుటుంబాల ద్వారా ఈ ఆర్థి క సంవత్సరాంతానికి 5 కోట్ల ఖాదీ రుమాళ్లు తయారు చేయించాలన్న లక్ష్యం ఉందని తెలిపారు. మహాత్మా గాంధీ ఆశయం పేరకు అట్టడుగు వర్గాల వారి అభివృద్ధి దృక్పథంతోప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. మంత్రి గడ్కరీ మాట్లాడుతూ బాధి త కుటుంబాలు ఇళ్లు విడిచి ఉపాధికోసం వెళ్లకుండా ప్రభుత్వం స్థానికంగానే ఉపాధిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నక్సలి జం, మావోయిజం, ఉగ్రవాదం కారణంగా ప్రజల దైనందిన జీవనం గడవడం కూడా సవాలుగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ, కాశ్మీర్‌లలోని కు ట్టు కేంద్రాల్లో తయారైన రుమాళ్లను పాన్ ఇండి యా విధానం ద్వారా విక్రయిస్తున్నట్టు చైర్మన్ సక్సే నా తెలిపారు. 15 లక్షల కిలోల నూలు వినియోగిస్తున్నందున అందుకు సంబంధించి 25 లక్షల రో జుల ఉపాధి స్పిన్నింగ్ ద్వారా కూడా కలుగుతోందన్నారు. అలాగే 12.5 లక్షల మందికి నేత ద్వారా, 7.5 లక్షల మందికి కటింగ్, కుట్టు, ప్యాకింగ్ ద్వారా ఉపాధి కలుగుతోందని తెలిపారు.