బిజినెస్

భారత్‌లో ఆటోమొబైల్ సాంకేతికత విస్తరణకు మార్గం సుగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: భారత్‌కు చెందిన ‘ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా’ (ఏఆర్‌ఏఐ)తో తమ సంస్థకు ఒప్పందం కుదిరిందని ఫ్రెంచ్‌కు చెందిన టైర్ల దిగ్గజ కంపెనీ ‘మిచెలిన్’ బుధవారం నాడిక్కడ ప్రకటించింది. రవాణా రంగంపై అవగాహనను పెంపొందించడంతోబాటు, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవాలని నిర్ణయించినట్టు తెలిపింది. అలాగే భారత్‌లో ఆటోమొబైల్ టెక్నాలజీ ప్రాజెక్టుల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయనున్నట్టు వివరించింది. ఈక్రమంలో ఇరు సంస్థల మధ్య కుదిరిన ఎంఓయూ మేరకు భారత్‌లో అటోమొబైల్ రంగ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై కలిసి పనిచేస్తామని మిచెలిన్ తెలిపింది. ప్రత్యేకించి శిక్షణ, వాహనాల సామర్ధ్య పెంపు, టైర్ల సాంకేతికత, భవిష్యత్తులో పెట్టుబడుల పెంపువంటి విషయాల్లో పరస్పర అవగాహనతో పనిచేస్తామని వివరించింది. అలాగే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా టైర్లను నియంత్రణ చట్టాలకు అనుగుణంగా పరీక్షించడం జరుగుతుందని, ప్రధానంగా తేమ, గ్రిప్, రోలింగ్ రెసిస్టెన్స్ వంటి అంశాలపై ఈ పరీక్షలు ఉంటాయని ఆ కంపెనీ వివరించింది. ఈదేశ పరిస్థితులకు అనుగుణంగా టైర్ల నాణ్యత ఎలావుండాలన్నది ఖచ్చితమైన సాంకేతికతతో నిర్ణయం జరుగుతుందని మిచెలిన్ గ్రూప్ కార్యనిర్వాహక వర్గంలో సభ్యుడు, ఉపాధ్యక్షుడు ఎరిక్ ఫిలిప్ వినెస్సీ ఈ సందర్భంగా విలేఖరులకు తెలిపారు. ఈ సరికొత్త ఒప్పందం ద్వారా టైర్ టెక్నాలజీలో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) మరింతగా బలోపేతం, నాణ్యతాయుతం అవుతాయని ఏఆర్‌ఏఐ డైరెక్టర్ రష్మీ ఉర్ద్వారేషె తెలిపారు.