బిజినెస్

ప్రయాస లేకుండా పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 18: ఎటువంటి ప్రయా స లేకుండా ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (ఎస్‌ఈజెడ్) పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని విశాఖ ప్రత్యేక ఆర్థిక మండలి (వీఎస్‌ఈజెడ్) డెవలప్‌మెంట్ కమిషనర్ రామ్మోహన రెడ్డి పిలుపునిచ్చారు.
ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, అమెరికా తెలుగు అసోసియేషన్ (ఏటీఏ) సంయుక్తంగా విశాఖలో బుధవారం నిర్వహించిన బిజినెస్ సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ మేకిన్ ఇండియాను మాన్యుఫేక్చర్ ఇండియాగా మార్చాలన్న కేంద్రం విధానాల మేరకు ప్రత్యేక ఆర్థిక మండళ్లలో డ్యూటీ ఫ్రీ, టాక్స్‌ఫ్రీ పథకాలు అమలవుతాయన్నారు. ముఖ్యంగా ఎస్‌ఈజెడ్‌లో నెలకొల్పే యూనిట్లకు బయట నుంచి ఎటువంటి ఒత్తిళ్లు ఉండవని, కార్మిక సంఘాల ఏర్పాటు, సమ్మెలు తదితర సమస్యలు తలెత్తవని భరోసానిచ్చారు. జీఎస్టీ 18 శాతం, కస్టమ్స్ డ్యూటీ 30 శాతం నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. ఎస్‌ఈజెడ్‌లో యూనిట్ నెలకొల్పేందుకు ముందుకు వస్తే ఒక నెలలోనే అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తామని, ఇవన్నీ కమిషనర్ చేతుల మీదుగానే జరుగుతాయన్నారు.
ప్రస్తుత ఆర్థిక స్థితి మందగమనంలో ఉన్నప్పటికీ వీఎస్‌ఈజెడ్ మూడు త్రైమాసికం అంతానికి 37 శాతం ఎగుమతుల్లో వృద్ధి సాధించిందని తెలిపారు. ఐటీ ఎగుమతుల్లో వీఎస్‌ఈజెడ్ 88శాతం వృద్ధి సాధించిందన్నారు. ఏపీలో ఐటీ ఎగుమతులు కేవలం రూ.192 కోట్లు ఉండగా, హైదరాబాద్‌లో రూ.8.400 కోట్లుగా పేర్కొన్నారు. వీఎస్‌ఈజెడ్‌లో పరిశ్రమలు నెలకొల్పే వారికి అతి తక్కువ ధరకే స్థలాలు కేటాయిస్తామన్నారు. చదరపు అడుగు రూ.12కు, చదరపు మీటరుకు అద్దె సవంత్సరానికి కేవలం రూ.150 మాత్రమేనని వివరించారు. ఇన్ని రాయితీలు, సదుపాయాలు కల్పిస్తున్న వీఎస్‌ఈజెడ్‌లో ప్రవాసాంధ్రులు పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పూర్వపు అధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు సువిశాల తీరం వరంగా పేర్కొన్నారు. జల, వాయు, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయని, ఇంతకంటే మంచి వాతావరణం ఎక్కడా ఉండదన్నారు. రాష్ట్రంలో అయిదు విమానాశ్రయాలు, మరో అయిదు పోర్టులు ఉన్నాయని, ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు అవకాశం ఉందన్నారు. వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంతాన్ని పాలనా రాజధానిగా ప్రకటించడం ద్వారా మరింతగా వౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. పర్యాటకం, ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి వీఎంఆర్‌డీఏ కూడా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో పలువురు ప్రవాసాంద్ర పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

*చిత్రం...సదస్సులో మాట్లాడుతున్న వీఎస్‌ఈజెడ్ కమిషనర్ రామ్మోహన రెడ్డి