బిజినెస్

పెరిగిన ఎల్పీజీ వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఎల్పీజీ వినియోగం పెరిగిందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకకారం, సెప్టెంబర్ మాసంతో పోలిస్తే, అక్టోబర్‌లో వినియోగం పెరిగింది. అయితే, ఆగస్టు కంటే తక్కువ కావడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకూ గల మధ్యకాలంలో ఎల్పీజీ వినియోగ గణాంకాలను ప్రభుత్వం ప్రకటించింది. నిరుడు అక్టోబర్‌లో 2,054 మెట్రిక్ టన్నులున్న వినియోగం, నవంబర్‌లో 1,841 మెట్రిక్ టన్నులకు తగ్గింది. డిసెంబర్‌లో మళ్లీ పెరిగి, 2,165 మెట్రిక్ టన్నులకు చేరింది. ఈ ఏడాది జనవరిలో మరింత పెరగడంతో, 2,312 మెట్రిక్ టన్నులుగా నమోదైంది. ఫిబ్రవరిలో 2,216, మార్చిలో 2,268 మెట్రిక్ టన్నులుగా ఉన్న వినియోగం, జూన్‌లో 1,794 మె ట్రిక్ టన్నులకు పడిపోయింది. జూలైలో రెండు మ రోసారి 2వేల ఫిగర్‌ను దాటింది. 2,215 మెట్రిక్ ట న్నులుగా నమోదైన వినియోగం ఆగస్టులో రికార్డు స్థాయిలో 2,396 మెట్రిక్ టన్నులకు చేరింది. సెప్టెంబర్‌లో కొంత మెరుగుపడి, 2,183 మెట్రిక్ టన్నులకు చేరగా, అక్టోబర్‌లో మళ్లీ పెరిగింది, 2,360 మెట్రిక్ టన్నులుగా నమోదై, ఏడాది కాలంలో రికార్డు స్థాయి ఫిగర్స్‌లో రెండో స్థానానికి చేరింది. ఎల్పీజీ వాడకంలో ఒడిదుడుకులు సహజమేకానీ, క్రమంగా పెరగడం ఆందోళన కలిగించే అంశం.