బిజినెస్

2.30 లక్షలకు చేరువలో ఏటీఎంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నగదు రహిత (క్యాష్ లెస్) ఇండియాను కేంద్రం కోరుతున్నప్పటికీ, ఏటీఎంల సంఖ్య దేశంలో పెరుగుతునే ఉంది. ఈ సంఖ్య 2.30 లక్షలకు చేరువైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ప్రకారం అక్టోబర్ చివరి నాటికి దేశంలో 2,29,374 ఏటీఎంలు ఉన్నా యి. పెద్ద నోట్ల రద్దు (డీ మానిటైజేషన్) తర్వాత కేంద్రం, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల ప్రకారం నగదు చలామణిని సాధ్యమైనంత వరకూ నియంత్రించాల్సి ఉంటుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, ప్రజలు ఇంకా ఈ విధానానికి ఎక్కువగా అలవాటు పడడం లేదన్న విషయం పెరుగుతున్న ఏటీఎంల సంఖ్య స్పష్టం చేస్తున్నది. ఆర్బీఐ ప్రకటించిన సమాచారం ప్రకారం గత ఏడాది అక్టోబర్ మాసంలో 2,20,154 ఏటీఎంలు ఉండగా, ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి 9,220 అదనంగా చేరాయి. 2.30 లక్షల సంఖ్యకు చేరువ అవుతున్నాయి. గత ఏడాది నవంబర్‌లో 2,20,114, డిసెంబర్‌లో 2,200,51 ఏటీఎంలు ఉండగా, ఈ ఏడాది జనవరి నాటికి 2,21,848కి పెరిగాయి. ఫిబ్రవరిలో 2,21,786, మార్చిలో 2,21,703 ఏటీఎంలు ఉన్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఏప్రిల్‌లో 2,27,164, మేలో 2,27,227, జూన్‌లో 2,26,839 ఏటీఎంలు ఉన్నాయి. ఈ సంఖ్య ఆతర్వాత కూడా పెరుగుతునే వచ్చింది. జూలై నాటికి 2,27,629, ఆగస్టులో 2,28,170, సెప్టెంబర్‌లో 2,27,886 ఏటీఎంలు ఉండగా, అక్టోబర్ నాటికి ఈ సంఖ్య 21,29,374కు చేరింది. ఈ పెరుగుదలను చూస్తుంటే, ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 2.30 లక్షల మైలురాయిని దాటడం ఖాయంగా కనిపిస్తున్నది.