బిజినెస్

భారతి ఏఎక్స్‌ఏ ఇన్సూరెన్స్ ఆదాయంలో వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: భారతి ఏఎక్స్‌ఏ జనరల్ ఇన్సూరెన్స్ ఆదాయంలో వృద్ధి నమోదైంది. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి ప్రథమార్ధంలో 1,586 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో, ఇదే కాలానికి వసూలైన మొత్తం 1,087 కోట్ల రూపాయలుకాగా, ఈ సారి 46 శాతం పెరిగిందని వివరించింది. మోటార్ వాహనాలు, పంటలు, ఆరోగ్య బీమా విభాగాల్లో డిమాండ్ ఎక్కువగా ఉందని తెలిపింది. మొత్తం వసూళ్లలో ఈ మూడు రంగాల వాటా 38 శాతం వరకూ ఉంటుందని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మరింత అభివృద్ధి నమోదవుతుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ శ్రీనివాసన్ ఆ ప్రకటనలో తెలిపారు. కొత్తకొత్త ఒప్పందాలు, అవగాహనలు, ఇతరత్రా కార్యక్రమాలతో కంపెనీ అత్యంత వేగంగా ముందుకు దూసుకెళుతున్నదని పేర్కొన్నారు. అత్యుత్తమ సేవలను తక్కువ ఖర్చుకే అందుబాటులోకి తీసుకోవడంతో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నదని తెలిపారు.