బిజినెస్

చివరి క్షణాల్లో అమ్మకాల ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 24: చివరి క్షణాల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మంగళవారం భారత స్టాక్ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో 30 షేర్ సూచీలు ప్రారంభంలో పెరిగినప్పటికీ, లావాదేవీలు చివరి దశకు చేరుకున్నప్పుడు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నా యి. ఫలితంగా సెనె్సక్స్ 181.40 పాయింట్లు (0.44 శాతం) పతనమై, 41,461.26 పాయింట్లకు చేరింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) లో నిఫ్టీ కూడా ప్రారంభంలో లాభాల బాటలో నడచినప్పటికీ, చివరికి 48.20 పాయింట్లు (0.39 శాతం) తగ్గి, 12,214.55 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ ప్యాక్‌లో అన్నిటి కంటే హెచ్‌సీఎల్ టెక్ భారీగా నష్టపోయింది. ఆ కంపెనీ షేర్లు 1.80 శాతం తక్కువ ధరలో ట్రేడయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్) షేర్ల విలువ కూడా పతనమైంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్ర, ఎల్ అండ్ టీ, మారుతి, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీల షేర్లు కూడా నష్టాలను ఎదుర్కొన్నాయి. కాగా, ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, హీరో మోటోకార్ప్, ఎన్‌టీపీసీ కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. క్రిస్మస్‌తోపాటు ఈ ఏడాది చివరి సెలవుల నేపథ్యంలో, పెట్టుబడిదారులు మార్కెట్‌పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించలేదు. అంతేగాక, ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల కోసం కూడా వారు ఎదురుచూడడంతో స్టాక్ మార్కెట్లలో లావాదేవీలు మందగించాయి. అంతేగాక, అమ్మకాల ఒత్తిడి కూడా పెరిగింది. ఆసియా మార్కెట్ల పరిస్థితి మాత్రం మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. షాంఘై, టోక్యో స్టాక్ మార్కెట్లు లాభాలను ఆర్జిస్తే, హాంకాంగ్, సియోల్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐరోపా దేశాల్లో మార్కెట్లు లాభాలను సంపాదించాయి. ఇలావుంటే, ఇంట్రా డేలో డాలర్‌కు మారకపు విలువ 71.20 రూపాయలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చముదర ధర 0.08 శాతం పెరిగి, 66.44 డాలర్లకు చేరింది.