బిజినెస్

కేపిటల్ మార్కెట్ కళకళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత కేపిటల్ మార్కెట్ కళకళలాడడం ఖాయంగా కనిపిస్తున్నది. అంతర్జాతీయంగా ద్రవ్య లబ్ధత మెరుగు పడడంతో, దాని ప్రభావంతో దేశీయ కేపిటల్ మార్కెట్‌లోకి విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చి చేరుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నెలలోనే విదేశీ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐ) సుమారు 38,211 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టారు. డెబిట్, ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐల ఇనె్వస్ట్‌మెంట్స్ 11,182 కోట్ల రూపాయలుగా నమోదుకావడం విశేషం. ఆతర్వాత కూడా ఇదే ధోరణులు కొనసాగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్య లబ్ధతను సరళీకృతం చేయడంతో, విదేశీ పెట్టుబడులు పెరగడానికి ప్రధాన కారణం. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి కొన్ని నెలల ముందు వరకూ స్తబ్దుగా మార్కెట్ ఊపందుకుంది. ఎఫ్‌పీఐల నుంచి భారీ పెట్టుబడులు సాధ్యమవుతున్నాయి. గతేడాది చివరి నాటికే ఈక్విటీస్‌కు వీరి పెట్టుబడి 27,424.18 కోట్ల రూపాయలు. ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి ఇది 40 వేల కోట్ల రూపాయల వరకూ చేరే అవకాశం ఉందని అంటున్నారు. డెబిట్ మార్కెట్‌లోకి వారి ద్వారా 10,787.02 కోట్ల రూపాయలు గత ఆర్థిక సంవత్సరం చివరికి వచ్చిచేరాయి. ఎఫ్‌పీఐల్లో ఎక్కువ మంది భారత్‌పై మొగ్గు చూపడానికి అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాన్ని కూడా ఒక కారణంగా పేర్కోవచ్చు. ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతున్నాయనే వార్తలు రావడం, అంతలోనే ఎలాంటి ఫలితాలు లేకుండా ముగిశాయని సమాచారం వెలువడడం సహజంగానే విదేశీ పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేస్తున్నది. దీనికితోడు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటును పెంచకపోవడం కూడా విదేశీ పెట్టుబడిదారులను భారత్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. అంతేగాక, అత్యంత విస్తారమైన మార్కెట్లు ఉన్న దేశం కాబట్టి ఎఫ్‌పీఐలను భారత్ ఆకట్టుకున్నది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడంతో, భారత్‌లో పెట్టుబడులపై ఆశించిన దాని కంటే ఎక్కువగానే లాభాలు వస్తాయన్న అభిప్రాయం ఎఫ్‌పీఐలలో వ్యక్తమవుతున్నది. ఈ కారణంగా కూడా దేశీయ కేపిటల్ మార్కెట్‌లోకి వారి ద్వారా డబ్బు ప్రవాహంలా వచ్చి చేరుతున్నది. ఈ ఏడాది మార్చి మాసానికి ముందు కొంత కాలంగా అంటీముట్టనట్టు వ్యవహరించిన ఎఫ్‌పీఐలు, ఆతర్వాత ప్రత్యామ్నాయ మార్కెట్లను అనే్వషించడం ప్రారంభించారు. అదే సమయంలో, భారత్‌లో కేపిటల్ మార్కెట్ శరవేగంగా విస్తరించడాన్ని గమనించి, ఇటువైపు దృష్టిని మరల్చారన్నది వాస్తవం. దీనికితోడు ద్రవ్య లబ్ధత మెరుగు పడడం కూడా భారత కేపిటల్ మార్కెట్‌కు కలిసొచ్చింది. అన్ని అంశాలు అనుకూలంగా ఉండడంతో, భారత కేపిటల్ మార్కెట్ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నది.