బిజినెస్

కృత్రిమ మేథ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 25: ఈఏడాది భారత్ కృత్రిమ మేథస్సుకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. సంబంధిత ఉద్యోగుల శాతాన్ని ఇప్పటికే ద్విగుణీకృతం చేసింది. ఇందుకు ప్రధానంగా సాంకేతికాభివృద్థి, వాణిజ్య మేథస్సు విస్తరణ వంటి అంశాలు దోహదం చేశాయని తాజా అధ్యయనం తేల్చింది. ఐతే ఇందుకు అనుగుణంగా నైపుణ్యాభివృద్థి జరగకపోవడం వల్ల ఇందుకు సంబంధించిన ఉద్యోగాల్లో అనేక ఖాళీలు ఇప్పటికీ పేరుకుపోయి ఉన్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. ‘ఈడీ-టెక్’ కంపెనీ గ్రేట్ లెర్నింగ్ పేరిట ఈ కృత్రిమ మేథ పరిశ్రమల తీరుపై అధ్యయనం నిర్వహించింది. 2018 నుంచి కేవలం ఏడాది కాలంలో దేశంలో ఈ కృత్రిమ మేథస్సు ఆధారంగా పనిచేసే కంపెనీల సంఖ్య 1000 నుంచి 3000కు అంటే మూడు రెట్లు పెరిగాయి. అలాగే ఈ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా 40 వేల నుంచి 72 వేలకు పెరిగిందని ఆ అధ్యయనం వివరించింది. భారీగా వాణిజ్యపరమైన మేధస్సును దత్తత చేసుకోవడం, ఎంటర్‌ప్రైజెస్ ప్రాసెసింగ్‌లో సైతం కృత్రిమ మేథస్సుకు పెద్దపీట వేయడం, సంస్థల మధ్య డేటా నిర్వహణ విస్తరించడం, ప్రభుత్వాల పెద్ద బడ్జెట్ కేటాయింపుల్లోనూ మారిన విధానాలతో కృత్రిమ మేథకు ప్రాధాన్యత పెరుగుతోందని ఆ నివేదిక వెల్లడించింది. ఐతే ఇంకా 2500 అంశాలతో కూడిన కృత్రిమ మేథస్సుకు ఇప్పటికీ తగిన నిపుణత కరవైందని, అందుకే అధికంగా ఈ ఖాళీలు భర్తీకాకుండా ఉండిపోతున్నాయని తెలిపింది. ప్రధానంగా భారత్‌లో వృత్తినిపుణులు, యంత్ర సంబంధ అవగాహన, అందులో అనుభవం అన్న అంశాలపై ఈ అధ్యయనం సాగింది. ఇందుకు సంబంధించి ఇప్పుడే ఉద్యోగాల్లో చేరినవారినుంచి మీడియం, సీనియర్ కేటగిరీ ఉద్యోగుల వరకు పరిగణనలోకి తీసుకున్నట్టు ఆ అధ్యయన సంస్థ తెలిపింది. 2018లో 230 మిలియన్ డాలర్లు (రూ. 1,600 కోట్లు) ఉన్న ఈ కృత్రిమ మేథ ఆదాయం 2019లో 415 మిలియన్ డాలర్లు (రూ. 2,950 కోట్లు)కు పెరిగిందని ఆ నివేదిక వివరించింది. అలాగే భారత్‌లో కృత్రిమ మేథలో సరాసరి అనుభవం 7.2 సంవత్సరాలని, ఇందులో 21 శాతం ఉద్యోగులు మాత్రమే పదేళ్లకు పైబడిన అనుభవం కలిగివున్నారని తెలిపింది. అలాగే ఈ రంగంలోకి కొత్తగా చేరిన ఉద్యోగుల సంఖ్య గత 3,700 మంది కాగా ఈ ఏడాది ఆ సంఖ్య 6000కు (60 శాతం) పెరిగింది. ప్రధానంగా నిపుణతను పెంచుకునే వారికి ఈ రంగంలో విస్తృతమైన అవకాశాలున్నాయని గ్రేట్ లెర్నింగ్ సహ వ్యవస్థాపకుడు హరికిషన్ నాయర్ తెలిపారు. 2020లో భారీ సంఖ్యలో ఉద్యోగులు ఈ రంగానికి మారుతారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఈ రంగంలో దేశ వ్యాప్తంగా గత ఏడాది 13వేల ఉద్యోగాలు ఏర్పడగా, ఈ ఏడాది 23వేల ఉద్యోగాలు ఏర్పడ్డాయన్నారు. ఇందులో ఢిల్లీలో 17,000, ముంబయిలో 9000, హైదరాబాద్‌లో 8,000, పూనేలో 7,200, చెన్నైలో 5,800 ఉద్యోగాల వంతున కొత్తగా ఏర్పడినట్టు ఆ అధ్యయనం వివరించింది. ఈ రంగంలో ఉద్యోగులకు అత్యధిక వార్షిక వేతనం చెల్లిస్తున్న నగరాల్లో ముంబయి రూ. 17లతో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ 15.6 లక్షలతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, రూ. 10.8 లక్షలతో చెన్నై అతి తక్కువ వేతనం ఇచ్చే నగరంగా చివరి స్థానంలో ఉంది.