బిజినెస్

పొరుగు దేశాలతో వాణిజ్య స్నేహ హస్తానికి చైనా తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాచెంగ్డ: అమెరికాతో వాణిజ్య సంబంధాల విషయంలో క్లిష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న చైనా ఈ విషయంలో తన పొరుగు దేశాలతో స్నేహ బంధాన్ని విస్తరించుకోవడంపై దృష్టి సారించింది. ప్రధానంగా జపాన్, దక్షిణ కొరియాలతో వౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన అంశాలపై వాణిజ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు చైనా కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ పొరుగు దేశాల ప్రతినిథులతో ఈ వారం విస్తృతంగా చర్చలు సాగిస్తోంది. ఈక్రమంలో చైనా ప్రధాన మంత్రి లీ కెక్వియాంగ్ బుధవారం నాడిక్కడ జపాన్ ప్రధాన మంత్రి షింజోఅబెతో జరిగిన సమావేశం అనంతరం మాట్లాడుతూ జపాన్‌తో తమ వాణిజ్య సంబంధానలను, ఆర్థిక పరమైన పరస్పర సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయించామన్నారు. చైనాలోని వాయువ్య నగరం చెంగ్డూలో మూడు దేశాల మధ్య సంబంధాల విస్తరణ అంశంపై జరిగిన శిఖరాగ్ర సదస్సులో చైనాప్రధాని ప్రసంగించారు. కాలక్రమంలో తమ సేవా రంగ వాణిజ్యాన్ని కూడా జపాన్‌లో విస్తరిస్తామని లీ కెక్వియాంగ్ తెలిపారు. కాగా గత సోమవారం నాడు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయ్ ఇన్‌తో సమావేశమై ప్రత్యేకంగా చర్చించిన మీదట లీ క్వియాంగ్ మాట్లాడుతూ కొరియాతో చైనా, ఐరోపా అనుసంధాన రైలుమార్గ ప్రాజెక్టుపై కలిసిపని చేయాలని నిర్ణయించామన్నారు. అమెరికాతో తలెత్తిన వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ మార్కెట్లనీ సుమారు రెండేళ్ల కాలంగా ఇబ్బందులు ఎదుర్కొన్న దృష్ట్యా చైనా వాణిజ్యపరమైన వ్యూహాన్ని మార్చినట్టు తెలుస్తోంది. అమెరికాతో జరుగుతున్న సుదీర్ఘ చర్చలు ఇటీవలే ఓ మధ్యంతర ఒప్పందంతో ఓ దశ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. కాగా గత మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మూడు దేశాల మధ్య సేచ్ఛాయుత వాణిజ్యం విషయంపై సైతం అంగీకారం కుదిరింది. ఈ మూడు దేశాల మధ్య 2018లో 120 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది.