బిజినెస్

రైల్వే ఆదాయంపై మాంద్యం ప్రభావం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: రైల్వే చార్జీలు పెరగనున్నాయా? రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఔనన్నట్లుగానే సమాధానం ఇస్తున్నాయి. ప్రయాణికుల చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీల పెంపు యోచనపై మీమాంసలో ఉన్నట్లు యాదవ్ గురువారం తెలియజేశారు. అయితే, చార్జీలను పెంచుతారా? అని అడిగిన ప్రశ్నను ఆయన తిరస్కరించారు. రైల్వేల రెవెన్యూ తగ్గడంతో పాటు ప్రయాణికుల చార్జీల పెంపు అంశాలు సున్నితమైన అంశం అయిన నేపథ్యంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని యాదవ్ విలేఖరుల సమావేశంలో పేర్కొనడం గమనార్హం. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తెలియజేశారు. సరకు రవాణాతో పాటు ప్రయాణికుల చార్జీల పెంపు హేతుబద్ధతపై ఆలోచిస్తున్నామనీ.. సున్నితమైన అంశం కారణంగా ఇంతకన్నా ఎక్కువగా తాను ఏమీ చెప్పలేనని బోర్డు చైర్మన్ వివరించారు. రైల్వే ట్రాఫిక్ గణనీయంగా పెరిగే విధంగా చర్యలు కూడా తీసుకోనున్నామని వివరించారు. ఆర్థిక మాంద్యం ప్రభావం రైల్వేలపై కూడా పడిందనీ.. సరుకు రవాణా, ప్రయాణికుల చార్జీల్లో ఈ లోటు కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ త్రైమాసికానికి సంబంధించి ప్రయాణికులు, సరుకు రవాణాలో 155 కోట్లు, 3,901 కోట్లు లోటులో రైల్వే నడుస్తోందని వివరించారు. ఏప్రిల్-జూన్ నెలల్లో రైల్వే ఆదాయం 13,398.92 కోట్లు ఉండగా.. ఈ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) 13,243.81 కోట్ల ఆదాయం లభించిందని చైర్మన్ యాదవ్ పేర్కొన్నారు.