బిజినెస్

ఫ్లాట్ రేట్.. కొత్త శ్లాబులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదాయం పన్ను విధానాన్ని సంపూర్ణంగా సంస్కరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఎలాంటి మినహాయింపులు లేని ‘్ఫ్లట్’ ఆదాయం పన్ను, అధిక ఆదాయం ఉన్న వారికి కొత్త స్లాబ్‌లు, వ్యక్తిగత ఆదాయం పన్ను తగ్గింపువంటి ప్రతిపాదనలను మోదీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2020 వార్షిక ప్రణాళకను వచ్చే పిబ్రవరి నెలాఖరుకు లోక్‌సభలో ప్రతిపాదించనున్నారు. నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రతిపాదించవలసిన వార్షిక ప్రణాళికపై పని చేయటం ప్రారంభించారు. ఆమె ఇటీవల వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సమావేశమై ఆయా రంగాలకు బడ్జెట్‌లో చేయవలసిన కేటాయింపులు, కొత్త పథకాలను ప్రారంభించటం గురించి చర్చించారు. మాంద్యంలో కొనసాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు ఆమె పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారని ఆర్థిక శాఖ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. ఆదాయం పన్ను విధానంలో సమూలమైన మార్పులు చేయటం ద్వారా ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరచాలని నిర్మలా సీతారామన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఆదాయం పన్నును మరింత సరళీకృతం చేయటంతోపాటు రక,రకాల మినహాయింపులను తొలగించి ఒకే రకమైన పన్ను విధానాన్ని అమలు చేయాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తోందని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులతోపాటు ప్రైవేట్ రంగంలో పని చేసే ఉద్యోగులు, నెలసరి జీతాల వారు వ్యక్తిగత ఆదాయం పన్నును తగ్గించాలని కోరుకోవటం తెలిసిందే. ఆదాయం పన్ను విధానాన్ని హేతుబద్దం చేయటం ద్వారా పన్ను ఎగవేతను నిరుత్సాహపరిచి పన్ను చెల్లించే వారి సంఖ్యను పెంచుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని అంటున్నారు. మోదీ ప్రభుత్వం గత సంవత్సరమే ఆదాయం పన్ను విధానాన్ని సరళీకృతం చేస్తారని అశించినా అది జరగలేదు. అయితే ఇప్పుడు నాలుగైదు రాష్ట్రాల్లో ఓటమిని చవి చూసిన మోదీ ప్రభుత్వం ఉద్యోగస్తులకు పన్ను మినహాయింపు ఇవ్వటం ద్వారా వారి మద్దతు సంపాదించే ప్రయత్నం చేయచవ్చనని అంచనా వేస్తున్నారు. అధిక ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం రక,రకాల స్లాబలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటిన్నింటని హేతుబద్దం చేయటం ద్వారా ఆకర్శనీయమైన స్లాబ్‌లను ప్రవేశ పెట్టాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఆదాయం పన్ను విధానాన్ని హేతుబద్దం చేయటం ద్వారా పన్నులు చెల్లించే దాదాపు మూడు కోట్ల మందికి ఆర్థిక వెసలుబాటు కల్పించాలని తద్వారా ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరచాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తోందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ రంగానికి దాదాపు ఒక లక్షా నలభై ఐదు వేల కోట్ల పన్ను రాయితీలు కల్పించటం తెలిసిందే. వౌళికసదుపాయాలు, ఉత్పత్తిరంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ రంగానికి పన్ను మినహాయింపులు, ఇతర సౌకర్యాలను ఇది వరకే కల్పించింది. మోదీ ప్రభుత్వం ఇప్పుడు వ్యక్తిగత ఆదాయం పన్నును హేతుబద్దం చేయటం ద్వారా వేతన జీవులను సంతోష పట్టేందుకు సిద్దమవుతోందని అంటున్నారు.
'చిత్రం... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్