బిజినెస్

టిడ్కో రివర్స్ టెండరింగ్‌లో మరో రూ.104 కోట్లు ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా తాజాగా గురువారం 104 కోట్ల రూపాయలను ఆదా చేశారు. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పనులకు ప్యాకేజీల వారీగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియను టిడ్కో నిర్వహిస్తోంది. నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించిన ప్యాకేజీలో 942 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 19,296 యూనిట్ల నిర్మాణానికి
టెండర్లు ఆహ్వానించారు. రివర్స్ టెండరు ప్రక్రియలో డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 839 కోట్ల రూపాయలకు బిడ్ దాఖలు చేసి ఎల్ 1గా నిలిచింది. గతంలో 20,864 యూనిట్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి, 151.9 కోట్ల రూపాయల మేర భారాన్ని తగ్గించామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకూ పిలిచిన 7 ప్యాకేజీల్లో 1966 కోట్లతో అంచనాలు రూపొందించగా, 255.94 కోట్ల రూపాయలను ఆదా చేశామన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించేందుకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.