బిజినెస్

సంక్రాంతికి 4940 టీఎస్ ఆర్టీసీ బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊళ్లకు బయలుదేరే హైదరాబాద్ నగరవాసులకు మస్తు బస్సులు నడుపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ని మారుమూల ప్రాంతాలకు సైతం టీఎస్ ఆర్టీసీ బస్సులు సిద్ధం అవుతున్నాయి. ప్రత్యేక బస్సుల్లో అధనపు చార్జీలు వసూళ్లు చేస్తామని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగుల్లో ఒకటైన సంక్రాంతి పండుగుకు బయలు దేరడానికి నగరవాసులు రిజర్వేన్ల కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే రైల్వే రిజర్వేషన్లు పూర్తి కావడంతో ప్రయాణికులు బస్సుల రిజర్వేషన్ కోసం తంటాలు పడుతున్నారు. గురువారం హైదరాబాద్ మహాత్మగాంధీ బస్సు స్టేషన్‌లో రంగరెడ్డి ఆర్టీసీ రీజియన్ అధికారులు సంక్రాంకి అధనపు బస్సులను నడపడానికి సిద్ధం అవుతున్నారు. రంగరెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ గురువారం అధికారులతో చర్చంచారు. తెలుగు రాష్ట్రాలకు దాదాపు 4940 టీఎస్ ఆర్టీసీ బస్సులను నడపడానికి సిద్ధం చేశామన్నారు. తెలంగాణకు 3414 బస్సులు, ఆంధ్రాకు 1526 బస్సులను నడపడానికి సన్నాహాలు చేశామన్నారు. గత యేడాది సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీకి దాదాపు 5 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందన్నారు. ఈ యేడాది రూ.6 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. జనవరి 9వ తేదీ నుంచి అదనపు బస్సులు నడుపుతామన్నారు. అలాగే తిరుగు ప్రయాణం కోసం జనవరి 17 నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకోవచ్చునని ఆయన సూచించారు.