బిజినెస్

వచ్చే ఏడాది అదనంగా 5జీ బ్యాండ్ల విక్రయానికి డీఓటీ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: త్వరలో అమల్లోకి రానున్న 5జీ నెట్‌వర్క్‌లో కొత్తగా 24.75 నుంచి 27.25 గిగాహెడ్స్ బ్యాండ్ల విక్రయాల నిమిత్తం కొన్ని సవరణలను, ధరల విధానాన్ని ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సిందిగా టెలీకమ్యూనికేషన్ల శాఖ ట్రాయ్‌ను కోరనుంది. బహుశా వచ్చే ఏడాది ఆరంభం, లేదా ప్రథమార్థంలో ఈ కొత్త స్పెక్ట్రం వేలం జరుగనున్న దృష్ట్యా ప్రతిబంధకాలను తొలగించుకునే విషయంపై టెలికాం శాఖ దృష్టి సారించింది. గత 20వ తేదీన డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ ఆమోదించిన రూ. 5.2 లక్షల కోట్ల స్పెక్ట్రం విక్రయాల ప్రణాళికకు ఈ కొత్త 5జీ విభాగంతో సంబంధం లేదు. 2020 మార్చి-ఏప్రిల్ మాసాల మధ్య ఇందులో భాగంగా 8,300 మెగాహెడ్స్ రేడియో తరంగాలను 22 సర్కిళ్లలో ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా టెలికాం శాఖ (డీఓటీ) విశ్వసనీయ వర్గాల కథనం మేరకు ప్రత్యేకించి ఈ ‘మిల్లీమీటర్ తరంగాల బ్యాండ్లు’ 24.75-27025 గిగాహెడ్జ్‌కు సంబంధించి డీఓటీ త్వరలో టెలికాం నియంత్రణ విభాగం (ట్రాయ్)ను వచ్చే జనవరి మాసంలో కలిసి కొన్ని సిఫారసులకోసం అభ్యర్థించనుందని తెలిసింది. ఈ బ్యాండ్లను విక్రయాలకు ఉంచాలని ఇప్పటికే టీఓటీ ఈ ఏడాది ఆరంభంలోనే నిర్ణయించింది. ఈక్రమంలో కొన్ని బాధ్యతలకు కాలపరిమితుల విషయంలో సడలింపులు అవసరమని డీఓటీ భావిస్తోంది. అలాగే 5జీకి చెందిన అదనపు సెక్ట్రంను సైతం వచ్చే ఏడాది విక్రయాలకు (వేలానికి) ఉంచాలని డీఓటీ నిర్ణయించిందని ఆ వర్గాలు తెలిపాయి. కాగా సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్)పై సుప్రీం కోర్టు ఇచ్చిన రూలింగ్ నేపథ్యంలో అదనపుచట్టబద్ధమైన బకాయిలతో టెలికాం కంపెనీలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆ వర్గాలు స్పందిస్తూ తమ పరిశ్రమతోబాటు ఇందుకు సంబంధించిన సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీఓఏఐ) సైతం 26 గిగాహెడ్స్ బ్యాండ్లను ట్రాయ్‌కు రెఫర్ చేయాల్సిందిగా కోరుతున్నట్టు తెలిపారు. ఒకవేళ ప్రస్తుత ధరలకే అదనపు స్పెక్ట్రంను తీసుకునేవారుంటే మంచి చేకూరే అవకాశాలున్నాయని బదులిచ్చారు. ఐనా ఈ విషయంలో ముందస్తు తీర్మానాలేవీ చేయదలుచుకోలేదన్నారు. కాగా స్పెక్ట్రం చెల్లింపులకు రెండేళ్ల మారిటోరియం ఉన్న దృష్ట్యా ముం దస్తు చెల్లింపుల అనంతరం 16 వాయిదాల్లో చెల్లింపులు చేసే వేసులుబాటు ఉందని ఆ వర్గాలు తెలిపాయి.