బిజినెస్

హెల్త్‌కేర్ సేవలకు జీరో రేటింగ్ జీఎస్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఆరోగ్య రక్షణ (హెల్త్‌కేర్) సేవలకు జీరో రేటింగ్ జీఎస్టీ విధానాన్ని అమలు చేయాలని హెల్త్‌కేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఏటీహెచ్‌ఈఏఎల్‌టీహెచ్) గురువారం నాడిక్కడ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అలాగే ఈ రంగానికి సంబంధించిన దీర్ఘకాలిక ఆర్థికావసరాలు, నిధుల సహకారం విషయంలో ప్రాధాన్యతను ఇవ్వాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ముందస్తు సిఫారసుల్లో భాగంగా ఆ సమాఖ్య ఈ సూచనలు, విజ్ఞప్తులు చేసింది. అలాగే టూటైర్, త్రీ టైర్ నగరాలతోబాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ మంచి అభివృద్థిని సాధించాలంటే భవన సదుపాయాలను సైతం కల్పించాలని కోరింది. 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో తమ రంగానికి పలు రాయితీలు వస్తాయని, ప్రత్యేకించి హెల్త్‌కేర్ సేవలు, హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ ప్రీమియం సేవలకు మెడికల్ వాల్యూ టూరిజం, జీరో రేటింగ్ జీఎస్టీ వంటి ప్రోత్సాహకాలు కల్పిస్తారని ఆశిస్తున్నామని ఎన్‌ఏటీహెచ్‌ఈఏఎల్‌టీహెచ్ అధ్యక్షుడు సుదర్శన్ బల్లాల్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే హెల్త్‌కేర్ ఇన్‌పుట్ సేవలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని సరళీకరించడం ద్వారా ఇన్‌పుట్ రుణాల్లో తేడా తొలగడంతోబాటు హెల్త్‌కేర్ సేవలందిస్తున్న నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, ఆసుపత్రులు, డయాగ్నాస్టిక్ సెంటర్ల వంటి సంస్థలకు ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన తెలిపారు. ఇందువల్ల వినియోగదారులపై సైతం ఆర్థిక భారం తగ్గేందుకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం హెల్త్‌కేర్ సర్వీసులకు జీఎస్టీని చెల్లించకపోతే హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్లకు ఇన్‌పుట్ పన్నులపై రుణాన్ని పొందేందుకు అర్హత లభించడం లేదని ఇందువల్ల ఆర్థిక భారం తడిసిమోపెడవుతోందని ఆయన తెలిపారు. తాజా జీఎస్టీ విధానంతో పరికరాలపై పన్ను బాగా పెరిగిందని సుదర్శన్ బల్లాల్ తెలిపారు.