బిజినెస్

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెబంర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజైన గురువారం సైతం నష్టాల బాటలో నడిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భారీగా నష్టపోయాయి. డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల కాలవ్యవధి ముగుస్తుండటంతో మదుపర్లు ఆచితూచి అడుగేసినట్టు విశే్లషకులు అంచనావేస్తున్నారు. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఇంట్రాడేలో ఏకంగా 328.37 పాయింట్ల దిగువకు జారిపోయింది. అయితే తర్వాత కొంత కోలుకుని చివరిగా 297.50 పాయింట్ల (0.72 శాతం) నష్టంతో 41,163.76 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఒడిదుడుకులకు గురైన ఈ సూచీ ఓ దశలో 41,132.89 పాయింట్ల కనిష్టానికి చేరింది. ఇక బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 88 పాయింట్లు (0.72 శాతం) కోల్పోయి 12,126.55 పాయింట్ల దిగువన స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా 2.23 శాతం నష్టపోయింది. అదే బాటలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, సన్‌పార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి, టైటాన్, కోటక్ బ్యాంక్ సైతం నష్టాలపాలయ్యాయి. మరోవైపుఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, టాటాస్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం 1.63 శాతం లాభపడ్డాయి. కాగా డిసెంబర్ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల కాలవ్యవధి ముగిసిపోవడంతోబాటు, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఈ ఏడాది ముగింపులో సెలవులు రావడం కూడా మదుపర్లను ఆచితూచి అడుగేసేలా చేశాయని అంటున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల నుంచి పెట్టుబడులు వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినా ఆ ప్రక్రియ అమలులో జాప్యం చోటుచేసుకుంటోంది. కాగా అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన క్రమంలో విదేశీ మార్కెట్లు భద్రత జోన్‌లో ఉన్నాయని ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ తెలిపారు. అలాగే వచ్చే బడ్జెట్ ప్రతిపాదనలపై మదుపర్లు దృష్టిని కేంద్రీకరించారని అంటున్నారు. ఇక రంగాలవారీగా చూస్తే బీఎస్‌ఈలో టెలికాం, ఇంధనం, కేపిటల్ గూడ్స్, బ్యాంకెక్స్, చమురు, సహజ వాయువులు, టెక్, హెల్త్‌కేర్ సూచీలు 1.73 శాతం నష్టపోయాయి. లోహ, వౌలక పరికరాలు 0.66 శాతం లాభాలను సంతరించుకున్నాయి. ఇక బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్ 0.13 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ మాత్రం 0.38 శాతం నష్టపోయాయి.
లాభాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా ఖండ దేశాల్లో షాంఘై, టోక్యో, సియోల్ లాభాలను సంతరించుకున్నాయి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం స్తబ్థుగా మారింది. ఇంట్రాడేలో 71.27గా ట్రేడైంది. ఇక ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 0.33 శాతం పెరిగి బ్యారెల్ 67.42 డాలర్ల వంతున ట్రేడైంది.