బిజినెస్

పీఎంవీవీఐ పింఛన్ పథకానికి ఇక ఆధార్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీకే) పింఛన్ పథకంలో సబ్‌స్క్రైబర్లుగా మారేందుకు ఇకపై ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ గురువారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం ద్వారా జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) లబ్ధిదారులకు ఏడాదికి 8 శాతం రేట్ ఆఫ్ రిటర్న్ చెల్లిస్తుంది. 2017-18, 2018-19 కేంద్ర బడ్జెట్లలో ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది. కాగా ఈ పథకం ద్వారా లబ్ధిపొందగోరే అర్హులైనవారు విధిగా 12 డిజిట్ల బయోమెట్రిక్ ఆధార్ గుర్తింపు కార్డు నంబర్‌ను అనుసంధానించుకోవాలని, లేదా ఆధార్ సాధికారత చేయించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ సూచించింది. 2016 ప్రభుత్వం నుంచి ఆర్థిక పరమైన ప్రయోజనాలు, సబ్సిడీలు, సేవలు పొందేందుకు లక్ష్యంగా నిర్దేశించిన ఆధార్ చట్టం ప్రకారం ఆ గుర్తింపు కార్డు తప్పని సరి అని, ఒక వేళ ఆ కార్డు లేకపోయినా పథకానికి దరఖాస్తు చేసుకునే ముందు ఆధార్ పొందాల్సి వుంటుందని తెలిపింది. ఒకవేళ బయోమెట్రిక్ లేదా ఆధార్ వన్‌టైం పాస్‌వర్డ్, లేదా టైం ఆధారిత ఓటీపీ సాధికారిత వీలుకాని పక్షంలో ఫిజికల్ ఆధార్ లెటర్‌లోని క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ ద్వారా సాధికారితను వెరిఫై చేయడం జరుగుతుందని ఆ నోటిఫికేషన్ వివరించింది. కాగా ఈ పథకం కింద లబ్ధిదారుడు మదుపు చేసే మొత్తానికి సంబంధించిన పరిమితిని రూ. 7.5 లక్షల నుంచి రూ. 15లక్షలకు (రెండు రెట్లకు) కేంద్ర ప్రభుత్వం పెంచింది. వచ్చే మార్చి 2020 వరకు ఈ పథకానికి సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌కు అవకాశం ఉంది.