బిజినెస్

ఎండీఆర్ చార్జీలు ఉండవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: రూపే, యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు జరిపే వారికి కేంద్రం ప్రభుత్వం ఊరట కల్పించింది. మర్చెంట్ డిస్కంట్ రేట్ (ఎండీఆర్) చార్జీలను ఎత్తివేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులతో శనివారం ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ రుపే, యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలపై ఎండీఆర్‌ను జనవరి ఒకటో తేదీ నుంచి ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 50 కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీల లావాదేవీలను ఇకపై రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తుందని చెప్పారు. రుపే డెబిట్ కార్డును, యూపీఐ క్యూఆర్ కోడ్‌ను వినియోగదారులకు అందిస్తుందని వివరించారు. డిజిటల్ విధానం ద్వారా లావాదేవీలను అనుమతించినందుకుగాను ఆయా బ్యాంకులకు వ్యాపారులు ఎండీఏ చార్జీలను చెల్లిస్తారు. చాలా మంది వ్యాపారులు ఈ మొత్తాలను వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇకపై అటు వ్యాపారులకు, ఇటు వినియోగదారులకు కూడా ఎండీఏ చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. చార్జీలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు నిర్మల ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను బ్యాంకులు, ఇతర భాగస్వాములతో చర్చించిన తర్వాతే, ఎండీఆర్‌పై చార్జీల ఎత్తివేత నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చేసిన ప్రకటనను అనుసరించి తీసుకున్న నిర్ణయం జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నదని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నానని ఆమె తెలిపింది. స్వదేశీ చెల్లింపు మాధ్యమాలైన రుపే, భీమ్ యూపీఐకి ఈ నిర్ణయం వల్ల విదేశీ కంపెనీలతో పోటీపడే అవకాశం లభిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఆధార్ పే, డెబిట్ కార్డులు, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ తదితర మాధ్యమాల ద్వారా చెల్లింపులకు చార్జీలను వసూలు చేయరాదన్న నిర్ణయాన్ని త్వరలో అమలు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల ప్రకటించిన విషయం తెలిసిందే.
'చిత్రం... ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులతో శనివారం న్యూఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్