బిజినెస్

త్వరలో భారత్‌కు ఆర్థిక సంక్షోభం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 28: భారతదేశం త్వరలోనే ఆర్థిక మాంధ్యంను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రముఖ ఆర్థిక విశే్లషకులు డి.పాపారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాజారెడ్డి అధ్యక్షతన శనివారం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ‘సంక్షోభంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డి.పాపారావు మాట్లాడుతూ 2018లో దేశంలో స్థూల జాతీయోత్పత్తి 8 శాతం నుంచి 4.5శాతానికి పడిపోయిందన్నారు. దేశంలో నిరుద్యోగం 73 నుంచి 74శాతానికి పెరిగిందన్నారు. దేశంలోని అందరికీ ఉద్యోగాలు కల్పించాలంటే నెలకు 10 లక్షల కొత్త ఉద్యోగాలు సృషించాలన్నారు. అయితే నేడు ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయని ఆయన వివరించారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తక్కువ మంది చేత ఎక్కువ పని చేయిస్తున్నారని అన్నారు. పెరిగిన ఆర్థిక సంక్షోభంతో కార్లు, బైక్‌ల అమ్మకాలు తగ్గాయని చెప్పారు. 2008లో అమెరికా ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం తరహాలో భారత్ సైతం సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఎంతోదూరంలో లేదన్నారు. ఆప్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాజారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభం కారణంగా స్థూల జాతీయోత్పత్తి గణనీయంగా పడిపోయిందని చెప్పారు. 2014-18 సంవత్సరాల మధ్యకాలంలో 62 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయన్నారు. దాదాపు 85వేల ఫ్యాక్టరీలు మూతపడ్డాయని చెప్పారు. ప్రపంచ ఆకలి సూచికలో మనదేశం 102వ స్థానంలో ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను పల్లి బఠానీలు అమ్మినట్లు అమ్మేశారన్నారు. కార్పొరేట్ దిగ్గజాలైన నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలు లక్షల కోట్ల రూపాయలను తీసుకుని బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టారని చెప్పారు. భారత్ అప్పులు నేడు 88 లల కోట్లకు చేరిందని రాజారెడ్డి చెప్పారు. ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మహదేవమ్మ మాట్లాడుతూ వ్యవసాయ రంగం బాగుపడితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఈ రంగానికి రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆటోరంగానికి రాయితీలు ఇవ్వడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి విశ్వనాథ రెడ్డి, ఎన్‌ఎస్‌ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు నీరుగుట్టు నగేష్, డిగ్రీ కళాశాల ఆర్థికశాస్త్ర విభాగం అధ్యాపకురాలు శారద, అధ్యాపకులు విద్యులత, అరుణకుమారి, శ్రీలత, నందిని, పెద్దరాయుడు తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం... ఆర్థిక సంక్షోభంలో భారతదేశం అనే అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగిస్తున్న ఆర్థికరంగ విశే్లషకుడు డీ పాపారావు