బిజినెస్

స్వల్ప నష్టాలతో ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: క్రిస్మస్ సందర్భంగా ఒక రోజు సెలవు రావడంతో, నాలుగు రోజులు మాత్రమే ట్రేడింగ్ జరిగిన ఈవారం భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 106.40 పాయింట్లు, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 26 పాయింట్లు పతనమయ్యాయి. అయితే లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం ఇటు సెనె్సక్స్, అటు నిఫ్టీ భారీ లాభాలను నమోదు చేయడంతో, రాబోయే వారానికి అవసరమైన కొత్త ఊపిరి అందింది. సోమవారం ట్రేడింగ్ ఆరంభంలో కొంత మెరుగ్గానే కొనసాగినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత మందగించింది. 41,681.54 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెనె్సక్స్ చివరికి 38.88 పాయింట్లు కోల్పోయి 41,642.55 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా 12,262.75 పాయింట్లుగా ప్రారంభమైన నిఫ్టీ 3.05 పాయింట్లు పతనమై 12,259.70 పాయింట్లకు పడిపోయింది. జాతీయ, అంతర్జాతీయయ రాజీయ, వాణిజ్య పరిస్థితులు అగమ్యగోచరంగా మారడంతో, మార్కెట్ల పతనం వరుసగా రెండో రోజు, మంగళవారం కూడా కొనసాగింది. సెనె్సక్స్ 181.40 పాయింట్ల నష్టపోయి 41,461.26 పాయింట్ల వద్ద ముగిసింది. హెచ్‌సీఎల్ టెక్ షేర్ల ధర అత్యధికంగా 1.88 శాతం నష్టపోగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వాటాలు ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని, 1.69 శాతం లాభాలను ఆర్జించాయి. నిఫ్టీ 48.20 పాయింట్లు పతనమై, 12,214.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. బీపీసీఎల్ వాటాలు 2.72 శాతం నష్టపోతే, ఎస్ బ్యాంక్ వాటాలు 3.02 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. బుధవారం మార్కెట్‌కు క్రిస్మస్ సెలవు కావడంతో, మదుపరులు ఆచితూచి అడుగు వేయడం కూడా స్టాక్ మార్కెట్ల పతనానికి కారణమైంది. సెలవు తర్వాత, గురువారం ఉదయం మళ్లీ తెరచుకున్న స్టాక్ మార్కెట్లకు మదుపరుల ముందస్తు జాగ్రత్తల కారణంగా నష్టాలు తప్పలేదు. సెనె్సక్స్ 297.50 పాయింట్లు నష్టపోయి 41,163.76 పాయింట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా 2.23 శాతం నష్టాలను ఎదుర్కొంది. ఓఎన్‌జీసీ వాటాలు 1.63 శాతం లాభాల్లో నడిచాయి. ఎన్‌ఎస్‌ఈలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. నిఫ్టీ 88 పాయింట్లు పతనం కావడంతో, 12,126.55 పాయింట్లుగా స్థిరపడింది. ఎస్ బ్యాంక్ వాటాలు అత్యధికంగా, 4.39 శాతం నష్టాలను చవిచూశాయి. ఓఎన్‌జీసీ మాత్రం ఎన్‌ఎస్‌ఈలోనూ రాణించింది. ఆ కంపెనీ షేర్లు 2.50 శాతం లాభపడ్డాయి.
వరుసగా మూడు రోజుల పతనం తర్వాత, ఈవారం ట్రేడింగ్‌కు చివరి రోజైన శుక్రవారం పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న అనుమానం సర్వత్రా వ్యక్తమైంది. మదుపరులు రక్షణాత్మకంగా వ్యవహరిస్తారని, కాబట్టి అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లకు నష్టాలు తప్పవని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ, అందుకు భిన్నంగా భారీ లాభాలు నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారన్న వార్త మార్కెట్లకు టానిక్‌లా పని చేసింది. అప్పటి వరకూ ఉన్న ప్రతికూల పరిస్థితులను అధిగమించిన సెనె్సక్స్ ఏకంగా 411.38 పాయింట్లు లాభపడి 41,575.14 పాయింట్ల వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంక్ వాటాలు 3.33 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. పవర్ గ్రిడ్ 2.27 శాతం, ఎస్బీఐ 2.24 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.93 శాతం, భారతి ఎయిర్‌టెల్ 1.89 శాతం లాభాలను సంపాదించాయి. అయితే, కోటక్ మహీంద్ర వాటాలు 0.42 శాతం నష్టాలను చవిచూశాయి.
అదే తరహాలో టైటాన్ 0.17 శాతం, టీసీఎస్ 0.13 శాతం, అల్ట్రాటెక్ 0.11 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ 119.25 పాయింట్లు లాభాలను ఆర్జించడంతో 12,245.80 పాయింట్లకు చేరింది. కోల్ ఇండియా వాటాలు 3.50 శాతంట లాభాలను సంపాదించాయి. యాక్సిస్ బ్యాంక్ 3.31 శాతం, బీపీసీఎల్ 2.67 శాతం, ఎస్బీఐ 2.23 శాతం, పవర్‌గ్రిడ్ 2.22 శాతం చొప్పున లాభాలను నమోదు చేశాయి. కాగా, ఎస్ బ్యాంక్ వాటాలు 1.44 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. విప్రో (1.02 శాతం), భారతి ఇన్‌ఫ్రా (0.82 శాతం), బ్రిటానియా (0.63 శాతం), కోటక్ మహీంద్ర (0.37 శాతం) కూడా అదే దారిలో నడిచాయి. స్థూలంగా చూస్తే, ఈవారం మార్కెట్లు నష్టాలను ఎదుర్కోగా, చివరి రోజున తిరుగులేని లాభాలను ఆర్జించడంతో మళ్లీ గాడిలో పడినట్టు స్పష్టమవుతుంది. కొత్త సంవత్సరంతో కూడిన వచ్చే వారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడిచేందుకు అవసరమైన ఊతం లభించింది.