బిజినెస్

కార్మిక, యాజమాన్యాల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: వివిధ సంస్ధల్లో యాజమాన్యాలకు, కార్మికుల మధ్య నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి ‘సంతుష్ట్’ పేరిట ఓ ప్రత్యేక పోర్టల్‌ను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనుంది. వచ్చే నెలలో ఆవిష్కృతం కానున్న ఈ పోర్టల్ ద్వారా క్రింది స్థాయి నుంచి కార్మిక చట్టాలను సమర్ధవంతంగా అమలు చేయాలన్న ప్రధాన లక్ష్యం ఉందని సంబంధిత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక దశలో ఈ సంతుష్ట్ (హిందీ ఫర్ శాటిస్‌ఫైడ్) పోర్టల్‌ను ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీలకు సంబంధించిన ప్రాథమిక రంగాల కార్మికులకు వర్తింప జేస్తారు. తర్వాత మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర విభాగాలకు సైతం వర్తింపజేస్తారు. ప్రతి అధికారి పనితీరును దీనిద్వారా అంచనావేయడం జరుగుతుందని, ఈ పోర్టల్ ద్వారానే ఉద్యోగులు, యాజమాన్యాలు తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చని ఆ అదికార వర్గాలు తెలిపాయి. ఈ పోర్టల్‌ను ఐదు నుంచి ఆరు మంది అధికారులతో ఏర్పాటైన అంతర్గత మానిటరింగ్ సెల్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 44 కేటగిరీల కేంద్ర కార్మిక చట్టాలను ఇందుకు సంబంధించి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రాసెస్ చేస్తోంది. దీనిపై నాలుగు బ్రాడ్ కోడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిప్రదేశంలో పరిస్థితులు అనే అంశాలుంటాయి. 2020 నాటికి ఈ నాలుగు కోడ్లు అమలులోకి వస్తాయని భావిస్తున్నారు.