బిజినెస్

తదుపరి ‘ఉక్కు’ చైర్మన్ ఎవరో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: భారతీయ ఉక్కు సాధికార సంస్థ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ‘సెయిల్’)కు తదుపరి చైర్మన్ ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. దేశంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థగా ప్రఖ్యాతిగాంచిన సెయిల్‌కు ప్రస్తుత చైర్మన్ ఏకే చౌదరి 2018 సెప్టెంబర్‌లో బా ధ్యతలు చేపట్టారు. వచ్చే 2020 డిసెంబర్‌తో ఆయన పదవీకాలం ముగుస్తుం ది. ఐతే ప్రభుత్వ రంగ అనుబంధ (అండర్‌టేకింగ్) సంస్థలకు సంబంధించిన చైర్మన్లకు ప్రభుత్వ అనుమతితో పదవీకాలం పొడిగించే అవకాశాలూ ఉన్నాయి. ఈక్రమంలో కేంద్ర ‘వ్యక్తిగత, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ‘పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) సెయిల్ చైర్మన్ ఎంపిక వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నిర్దేశాలను ఆ సంస్థ అమలు చేస్తుంది. కాగా ఈ సంస్థకు చైర్మన్‌గా ఎంపిక కాగోరేవారు 45 ఏళ్ల వయసుకు పైబడిన వారై ఉండాలి. అలాగే గుర్తింపు పొంది న విశ్వవిద్యాలయం నుంచి మంచి వ్యక్తిగత రికార్డుతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని పీఈఎస్‌బీ ఆదివారం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. మంచి సంస్థ నుంచి సీనియర్ స్థాయి మేనేజర్‌గా పనిచేసిన అనుభవం సైతం ఉండాలని, ఫైనాన్స్, మార్కెటింగ్, ఉత్పత్తి రంగాల్లో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని ఆ నోటిఫికేషన్ వివరించింది. ప్రభుత్వ రంగ ఎంటర్‌ప్రైజెస్ (పీఎస్‌ఈలు) లేదా ప్రైవేటు రంగ కంపెనీల్లో పనిచేస్తున్న వారు సైతం దరఖాస్తు చేయవచ్చని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చేత నియమితులైనవారు లేదా ఆలిండియా సర్వీసుల్లో ఉన్నవారిలో కనీసం అదనపు కార్యదర్శి హోదా కలిగిన వ్యక్తులు, లేదా తత్సమాన వేతనాలు ఆర్జిస్తున్న వారూ దరఖాస్తు చేయవచ్చని తెలిపింది. అలాగే సాయుధ మిలటరీ దళాలకు చెందిన వారైతే కనీసం లెఫినెంట్ హోదాగలవారై ఉండాలి. వచ్చే 2020 ఫిబ్రవరి 13వ తేదీలోపు తమకు చేరేలా దరఖాస్తులు పంపాలని పీఈఎస్‌బీ సూచించింది.