బిజినెస్

అభివృద్ధి చర్యలను అర్ధంతరంగా ఒదిలారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: భారత్‌లో పారిశ్రామిక, వాణిజ్య ఔత్సాహికులు (ఎంటర్‌ప్రెన్యూర్స్) గణనీయ శక్తితో ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టిన మోదీ ప్రభుత్వం ఉన్నట్టుండి తన దృష్టిని రాజకీయాల వైపు మార్చ డం మంచి పరిణామం కాదని ఫ్రెంచ్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త గై సోర్మన్ హితవుపలికారు. దేశ ఆర్థికాభివృద్థికి దోహదం చేసే పలు సంస్కరణలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రగతిని మధ్య దారిలో విడిచిపెట్టడం వల్ల అనేక అనర్ధాలు చోటుచేసుకుంటాయని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులతో అటు విదేశీ పెట్టుబడిదారు లు, దేశీయ మదుపర్లు సైతం భయాందోలనలతో ఉన్నారని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక పుస్కకాలు రచించిన సోర్మన్ తాజాగా ‘ఎకనామిక్ డస్ నాట్ లై’ శీర్షికతో, ‘ఎ డిఫెన్స్ ఆఫ్ ది ఫ్రీ మార్కెట్ ఇన్ టైం ఆఫ్ క్రైసిస్’ ఉప శీర్షికతో పుస్తకాన్ని వెలువరించారు. ‘ప్రస్తుతం భారత్‌లో ఆర్థిక వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన తక్షణావసరం ఉంద’ని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఔత్సాహికులకు ప్రోత్సాహంగా తొలుత ప్రధాని మోదీ ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా వెన్నుదన్నుగా నిలిచారని, అలాగే లైసెన్స్ రాజ్ నినాదాన్ని అమలు చేశారని, అవినీతిని నియంత్రించారని, మేకిన్ ఇండియా నినాదాన్ని విస్తృత స్థాయిలో కార్యరూపంలోకి తెచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐతే మార్గమధ్యంలోనే వాటికి తిలోదకాలిచ్చి రాజకీయాల్లోకి దృష్టి మరల్చి దేశానికి, ఇటు తన ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారని సోర్మన్ ఆదివారం నాడిక్కడ పీటీఐతో మాట్లాడుతూ పేర్కొన్నారు. హిందూత్వ, పౌరసత్వ చట్టాల కారణంగా మంచి జరుగుతుందా? లేక చెడు జరుగుతుందా? అని తీర్మానించడం తన పనికాదని ఓ ప్రశ్న కు సమాధానంగా ఆయన చెప్పారు. కేవలం ఆర్థికాభివృద్థికి ఆటంకం కలిగే అంశాలపై మాత్రం తాను సూచనలు చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి కార్యాలయ స్పందనకు పీటీఐ విలేఖరి యత్నించగా ఎలాంటి జవాబూ రాలేదు.