బిజినెస్

కొత్త సంవత్సరంలో కొంగొత్త ఆర్థిక ప్రగతి తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: మనదేశం ఆర్థికంగా వచ్చే 2020లో గణనీయంగా పుంజుకుంటుందని ‘్భరత పరిశ్రమల సమాఖ్య’ (సీఐఐ) ఆదివారం నాడిక్కడ ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా తగ్గిన వాణిజ్య ఉద్రిక్తతలు, కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకులు సంయుక్తంగా తీసుకున్న ఆర్థిక ఉద్దీపన చర్యలు దేశ ఆర్థిక వృద్ధికి ఆలంబన అవుతాయని తెలిపింది. ఈక్రమంలో వచ్చే వార్షిక బడ్జెట్‌లో కేంద్రం సరళతర విధానాలను అనుసరిస్తుందని, తద్వారా వార్షిక లోటును 0.5 నుంచి 0.75 శాతానికి తగ్గించాలన్న లక్ష్యం నెరవేరుతుందని సీఐఐ భరోసా ఇచ్చింది. వచ్చే బడ్జెట్‌లో అమలు చేసే విధానాలు దేశ ఆర్థిక ప్రగతికి బహుళ ప్రయోజనకరంగా ఉంటాయని సైతం ఆ చాంబర్ అంచనా వేసింది. కొత్త ఏడాదిలోకి ప్రవేస్తున్న ప్రస్తుత తరుణంలో ఆర్థిక మాంద్యాన్ని అధిగమించి క్రమంగా అభివృద్ధి వైపు అడుగులేసే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. కొనుగోలు నిర్వహణ సూచీ (పీఎంఐ) ఆధారంగా తామీ అంచనా వేస్తున్నట్టు ఆ సమాఖ్య పేర్కొంది. అలాగే విమాన ప్రయాణికుల సంఖ్యకూడా పెరిగిందని, కార్ల విక్రయాల్లో నెలకొన్న మాంద్యం కూడా క్రమంగా తగ్గుతోందని సీఐఐ అధ్యక్షుడు విక్రం కిర్లోస్కర్ ఈ సందర్భంగా విలేఖరులకు తెలిపారు.
ఇప్పటి వరకు మూడు త్రైమాసికాల్లోనూ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు కనిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ తదపరి త్రైమాసికాల్లో ఈ వృద్ధిరేటు పుంజుకుంటుందన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), దివాళా, బ్యాంకు మోసాల నియంత్రణ చట్టం (ఐబీసీ) కారణంగా నెలకొన్న ఆర్థిక ఇక్కట్లు ఎదురైన మాట వాస్తవమని, ఐతే వీటిలో జరిగిన సంస్కరణల ఫలితాలతో క్రమంగా ఆర్థికాభివృద్థి జరుగుతుందని ఆయన అంచనా వేశారు. 2019లో ఆర్థిక ఒడిదుడుకులు, దానికి దారితీసిన ప్రతిబంధకాలను క్రమపద్ధతిలో తొలగింపు చర్యలూ చోటుచేసుకున్నాయని, ఇందువల్ల స్వల్ప కాలానికి ఇబ్బందులు తప్పలేదని సీఐఐ అధ్యక్షుడు కిర్లోస్కర్, మరో అధ్యక్షుడు (డిసిగ్నేట్) ఉదయ్ కోటక్ తెలిపారు.