బిజినెస్

డిసెంబర్‌లో రూ. 2,613 కోట్ల నికర విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లలో ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడిదారులే అధిక సంఖ్యలో వాటాలు కొనుగోళ్లు చేశారు. గత శుక్రవారంతో ముగిసిన వాణిజ్య వారం వరకు ఈనెలలో రూ. 2,613 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వం తీసుకున్న ఆర్థికాభివృద్ధి చర్యలతో కార్పొరేట్ సంస్థల ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్న ఆశావహ దృక్పథమే ఇందుకు ప్రధాన కారణమని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. అలాగే అమెరికన్ ఫెడ్ సరళీకృత నిర్ణయాలు, ప్రపంచ దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు నిధులను మార్కెట్లలోకి జొప్పించడం ద్వారా నెలకొన్న ద్రవ్య లభ్యత కూడా మనదేశంలో విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు దోహదం చేశాయంటున్నారు. స్టాక్ ఎక్చేంజీల్లో లభ్యమైన డిపాజిటర్ల డేటా ప్రకారం విదేశీ పోర్ట్‌పోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) మనదేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి నికరంగా రూ. 6,301.96 కోట్ల మదుపు చేశారు. అలాగే రుణ మార్కెట్ల నుంచి రూ. 3,688.94 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈక్రమంలో మొత్తం నికర పెట్టుబడులు రూ. 2,613.02 కోట్లు ఈనెల 2 నుంచి 27వ తేదీ వరకు వచ్చినట్టు తేలింది. ఓ వైపు ఆర్థిక పరిస్థితులను గాడిలోపెట్టడం సవాలుగా మారినా, విధాన నిర్ణయాల్లో ఒడిదుడుకులు ఎదురైనా విదేశీ మదుపర్లు మన ఈక్విటీ మార్కెట్లపై విశ్వాసాన్ని కనబరచడం విశేషం. వచ్చే త్రైమాసికాల్లో దేశీయ కార్పొరేట్ రంగం గణనీయంగా పుంజుకుంటుందన్న అంచనాలే మదుపర్ల సెంటిమెంటుకు ఊతాన్చిచ్చాయని ప్రముఖ విశే్లషకుడు హిమాంన్షు శ్రీవాత్సవ విశే్లషించారు. జనవరి, జూలై, ఆగస్టు నెలలు మినహాయిస్తే ఈ ఏడాది మిగిలిన అన్ని నెలల్లో ఎఫ్‌పీఐలే నికర వాటాల కొనుగోలుదారులుగా ఉన్నారు. మొత్తం సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎఫ్‌పీఐలు ఇప్పటి వరకు మనదేశ మార్కెట్లలో రూ. 73,276.63 కోట్ల రూపాయలు మదుపు చేశారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్పొరేట్ పన్నుల కోత, స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) వంటి పలు ఆర్థిక ఉద్దీపన చర్యలు విదేశీ మదుపర్లను ఆకట్టుకున్నాయని విశే్లషకులు చెబుతున్నారు. భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల విలువ అధికంగా ఉందని, ప్రత్యేకించి అమెరికాలో తక్కువ వడ్డీరేట్లు అమలులో ఉన్నాయని, అలాగే జపాన్ వంటి కొన్ని ఆర్థికాభివృద్థి దేశాల్లో సైతం దాదాపుగా జీరో వడ్డీరేట్లు ఉన్నాయని, ఇదే తరహాలో ఐరోపా దేశాల్లోనూ ప్రతికూల వడ్డీరేట్లున్న ప్రస్తుత తరుణంలో భారత్ విదేశీ పెట్టుబడిదారులకు మంచి గమ్యస్థానంగా కనిపిస్తోందని మరో విశే్లషకుడు హరీష్ జైన్ పేర్కొన్నారు. ఐతే భవిష్యత్తులో పెట్టుబడుల తీరుపై మరో ప్రముఖ విశే్లషకుడు శ్రీవాత్సవ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో భారత్‌లో మారుతున్న రాజకీయ పరిస్థితులు, అమెరికా-చైనా మధ్య మళ్లీ మొదలైన వాణిజ్య ఉద్రిక్తతలను విదేశీ పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తున్నారని అన్నారు.