బిజినెస్

రూ.1,700 కోట్ల బకాయిలు చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: వెండర్లకు చెల్లించాల్సిన దాదాపు 1,700 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ చెల్లించిందని దాని సీఎండీ సీకే పుర్వార్ వెల్లడించారు. అలాగే, ఉద్యోగుల నవంబర్ జీతాలు కూడా చెల్లించినట్టు తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ కాంట్రాక్టర్లు, వెండర్లకు 1,700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించినప్పటికీ రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తం 10వేల కోట్ల రూపాయల మేర ఉందని తెలిపారు. నెలవారీగా బీఎస్‌ఎన్‌ఎల్ చెల్లించాల్సిన జీతాలు 800 కోట్ల రూపాయల మేర ఉంటాయని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎన్, ఎంటీఎన్‌ఎల్ పునరుద్ధరణ ప్యాకేజీ కింద 69,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రెండు సంస్థలను విలీనం చేయాలని కూడా ప్రభుత్వం సంకల్పించింది. అలాగే సిబ్బందికి వీఆర్‌ఎస్‌తోపాటు నష్టాన్ని పూడ్చుకునే అనేక చర్యలను కూడా చేపట్టింది.