బిజినెస్

ఫెడ్ రిజర్వ్‌పైనే అందరి దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు వచ్చే వారం మార్కెట్ సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం చూపించనున్న ఈ వారం జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన సమీక్ష సమావేశం ఫలితం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ వారం స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ అంతర్జాతీయ కేంద్ర బ్యాంకుల సమావేశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అందరి దృష్టీ ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానకర్తలపైనే ఉంటుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ తన రెండు రోజుల విధాన సమీక్షా సమావేశాన్ని మంగళవారం ప్రారంభిస్తుంది’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా మంగళవారమే తన విధానాన్ని సమీక్షించడానికి సమావేశం కానుందని ఆయన చెప్పారు. ప్రస్తుతానికయితే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడంపై ఇటీవల నెలకొన్న అనిశ్చితి తప్ప భారతీయ స్టాక్ మార్కెట్లకు సంబందించి ఎలాంటి నెగెటివ్ సంకేతాలేవీ లేవు. అందువల్ల లిక్విడిటీకి సంబంధించిన ర్యాలీ కొనసాగుతుందని మేము భావిస్తున్నాం అని కూడా సింఘానియా చెప్పారు. ఈ నెల 20-21 తేదీల్లో జరిగే సమావేశంలో ఫెడరల్ రిజర్వ ఆర్థిక అంచనాకు సంబంధించిన సంక్షిప్త స్వరూపాన్ని ప్రకటిస్తుంది. అది మార్కెట్లలో ఆటుపోట్లకు కారణం కావచ్చు’ అని క్యాపిటల్‌వయా గ్లోబల్ రిసెర్చ సంస్థ వ్యవస్థాపకుడు, సిఈఓ అయిన రోహిత్ గాడియా అన్నారు. మదుపరులు బ్యాంక్ ఆఫ్ జపాన్, అమెరికా ఫెడరల్ రిజర్వ తీసుకోబోయే నిర్ణయాలకోసం ప్రధానంగా ఎదురు చూస్తున్నారని, మదుపరుల సెంటిమెంట్ ఎలా వెళ్లాలో నిర్ణయించడానికి అవే ప్రధాన కారణాలవుతాయని ఆయన చెప్పారు. కాగా, ఈ వారం అందరి కళ్లూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంపైనే ఉంటాయని శ్యామ్‌కో సెక్యూరిటీస్ సిఈఓ జిమీత్ మోదీ చెప్పారు. రాబోయే కొద్ది వారాల పాటు మార్కెట్లు ఎలా కదులుతాయో నిర్ణయించడంలో ప్రధాన అంశం ఫెడరల్ రిజర్వ్ సమావేశమే ఉంటుందని కోటక్ సెక్యూరిటీస్ పిసిజి రిసెర్చ్ విభాగం అధిపతి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దిపేన్ షా అభిప్రాయ పడ్డారు. మూడు వారాల్లో తొలిసారిగా గత వారం సెనె్సక్స్, నిఫ్టీలు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.