బిజినెస్

సంక్రాంతి రద్దీకి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జనవరి 9: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని తట్టుకుంనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లును చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఏపీలోని వివిధ ప్రాంతాలకు సుమారుగా 4200 ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. అయితే హైదరాబాద్‌లో అత్యధికంగా రద్దీ ఉండే ఎంజీబీఎస్‌లో కొన్ని మార్పులను చేసింది. జనవరి 10 నుండి 13వ తేదీ వరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే రెగ్యులర్, పండుగ స్పెషల్ బస్సులన్నీ ఎంజీబీఎస్ బయట ఉన్న గౌలిగూడ సీబీఎస్ హాంగర్ నుండి మాత్రమే బయలు దేరనున్నాయి. అదే విధంగా విజయవాడ, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే అన్ని పండుగ స్పెషల్ బస్సులు హైదరాబాద్‌లోని బీహెచ్‌సీఎల్, ఈసీఐఎల్, కేపీహెచ్‌బి, ఎల్‌బి నగర్ ప్రాంతాల నుండి బయలుదేరనున్నాయి. ఈ బస్సు సర్వీసులు ఎంజీబీఎస్‌లోనికి రావంటూ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఎంజీబీఎస్ బోర్డింగ్ స్టేజి ఉన్న అన్ని సెక్టార్ల గురుడ, అమరావతి, నైట్ రైడర్, వెనె్నల బస్సులు ఎంజీబీఎస్ లోపలి నుండి బయలుదేరుతాయని ప్రకటించారు.