బిజినెస్

తూర్పు ప్రాంతంలో భారీ పెట్టుబడులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 11: దేశ తూర్పు ప్రాంతంలో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయి, స్టీల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు. తూర్పు రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘పూర్వోదయ’ కార్యక్రమాన్ని ప్రధాన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు రాష్ట్రాల్లో ఉక్కు, బాక్సైట్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయని అన్నారు. 70 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు ఈ ప్రాంతానికి వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్, ఆంధ్ర ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ‘పూర్వోదయ’ దోహదపడుతుందని, ఉక్కు పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ జాబితాలోకి బీహార్‌ను కూడా చేర్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 2017లో ప్రవేశపెట్టిన జాతీయ ఉక్క విధానం ప్రకారం 2030 సంవత్సరానికి ఉక్కు ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు చేరుకోవాల్సి ఉందని ప్రధాన్ తెలిపారు. ఇందులో ఐదు తూర్పు రాష్ట్రాల వాటా సుమారు 200 మిలియన్ టన్నులు ఉంటుందని ఆయన అన్నారు. దేశంలో ఇప్పుడు 140 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతున్నదని మంత్రి తెలిపారు. ఇందులో 90 మిలియన్ టన్నుల ఉత్పత్తి తూర్పు రాష్ట్రాల నుంచి జరుగుతోందని పేర్కొన్నారు.
స్టీల్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రసిక చాబూ మాట్లాడుతూ తూర్పు ప్రాంతాన్ని సహజ సిద్ధమైన ఖనిజ సంపదకు కేంద్రంగా అభివర్ణించారు. ఇక్కిడి రాష్ట్రాల్లో ఖనిజాలు విస్తారంగా ఉన్నాయని అన్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరాంతంలోగా ఐదు ట్రిలియన్ల దేశంగా అవతరించడమే భారత్ లక్ష్యంగా ఎంచుకుందని చెప్పారు. దానిని సాధించేందుకు స్టీల్ పరిశ్రమ కీలక పాత్రను పోషిస్తుందని ఆమె అన్నారు. ‘పూర్వోదయ’ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న వౌలిక సదుపాయాల కొరత, రవాణా సదుపాయాల లేమి వంటి సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఒకవైపు ఖనిజ సంపదను వెలికితీస్తూనే, మరోవైపు విరివిగా మొక్కలను నాటి, దీనిని గ్రీన్‌ఫీల్డ్‌గా మార్చడానికి కేంద్రం అన్ని విధాలా ప్రణాళికలను సిద్ధం చేసిందని ఆమె అన్నారు. ‘స్టీల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టులను సిద్ధం చేయడానికి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటైంది. తూర్పు ప్రాంతంలో భారీగా నిర్మాణాలను చేపట్టడం ద్వారా, పట్టణీకరణకు వీలవుతుంది. అన్ని రంగాల్లోనూ ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ‘పూర్వోదయ’ లక్ష్యం. దీనిని అందుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం’ అని ఆమె తెలిపారు. కోల్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ ఝా మాట్లాడుతూ ఇంథన దిగుమతులను గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇందు కోసం బొగ్గు ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఎంచుకున్నామని చెప్పారు. ప్రస్తుతం 607 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తిని 2023-2024 ఆర్థిక సంవత్సరంలోగా 900 మిలియన్ టన్నులకు పెంచేందుకు కృషి జరుగుతున్నదని అన్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) చైర్మన్ ఏకే చౌదరీ మాట్లాడుతూ తమ కంపెనీ తూర్పు రాష్ట్రాల్లో ఐదు యూనిట్లను నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. వీటి ద్వారా 20 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి జరుగుతున్నదని తెపారు. కాగా, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా గ్యాస్, ఆయిల్ పైప్ లైన్లను పెంచుతామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ సంజీవ్ సింగ్ అన్నారు. స్టీల్ ఉత్పత్తికి అవసరమైన ఇంథన వనరులను సమకూరుస్తున్నామని చెప్పారు. డిమాండ్‌కు తగినట్టు సరఫరా చేసేందుకు వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.